Friday, November 22, 2024
HomeదైవంSrisailam: మహాకుంభాభిషేకానికి సర్వం సిద్ధం

Srisailam: మహాకుంభాభిషేకానికి సర్వం సిద్ధం

ఏర్పాట్లపై రివ్యూ

రాష్ట్ర దేవదాయశాఖ కమీషనర్ ఎస్. సత్యనారాయణ మహా కుంభాభిషేకం ఏర్పాట్లను సమీక్షించారు.
అన్న ప్రసాద వితరణ భవన సముదాయములోని కమాండ్ కంట్రోల్ రూమ్ సమావేశ మందిరములో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు, దేవస్థానం వైదిక కమిటీ సభ్యులు, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.
సమావేశంలో ముందుగా కార్యనిర్వహణాధికారి కుంభాభిషేక మహోత్సవానికి సంబంధించిన ఆయా ఏర్పాట్లను గురించి వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిబ్బంది అందరు కూడా వారివారికి అప్పగించిన ప్రత్యేక విధులను బాధ్యతాయుతంగాను, సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఇప్పటికే రూపొందించుకున్న ప్రణాళికలను అనుసరించి సిబ్బంది అందరు కూడా వారి వారి విధులకు హాజరు కావాలన్నారు.
అనంతరం వైదిక కమిటీసభ్యులు మాట్లాడుతూ మహా కుంభాభిషేకానికి సంబంధించిన వైదిక కార్యక్రమాల గురించి తెలిపారు. అనంతరం కమీషనర్ ఎస్. సత్యనారాయణ మాట్లాడుతూ సిబ్బంది అందరు కూడా లోక కల్యాణం కోసం జరిపే ఈ కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొనే అవకాశం రావడం ఎంతో అదృష్టంగా భావించాలన్నారు.

- Advertisement -


ఇంకా వారు మాట్లాడుతూ మహా కుంభాభిషేక మహోత్సవంలో పీఠాధిపతులు, పలువురు ప్రముఖులు పాల్గొంటున్నందున ఎటువంటి లోటుపాట్లు లేకుండా సిబ్బంది అందరు వారి వారి విధులు నిర్వర్తించాలన్నారు. ముఖ్యంగా సమయ పాలనతో ఆయా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఆలయ ప్రాంగణములో కుంభాభిషేకం జరిగే గర్భాలయ విమానాలు, ఆలయ గోపురాలు, అన్ని ఉపాలయాల గోపురాలు, పరివార ఆలయాలు మొదలైన అన్ని చోట్ల కూడా దేవస్థానం సిబ్బందిని సమన్వయ అధికారులుగా నియమించాలన్నారు. ప్రతీ ప్రదేశంలో కూడా ఒక సమన్వయ అధికారి ఉండాలన్నారు.
కుంభాభిషేక సమయములో ఆలయ వేళలు మొదలైన వాటిని ఆలయ ప్రసార వ్యవస్థ ద్వారా ఎప్పటికప్పుడు భక్తులకు తెలియజేస్తుండాలన్నారు.
మహా కుంభాభిషేకాన్ని భక్తులు వీక్షించేందుకు వీలుగా క్షేత్ర పరిధిలో ప్రధాన కూడళ్ళలో ఏర్పాటు చేసిన ఎల్.ఈ.డి. స్క్రీన్ల వివరాలను కూడా ఆలయ ప్రసార వ్యవస్థ ద్వారా భక్తులకు తెలియజేయాలన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News