Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Poetry: తెలుగు కవిత-ప్రత్యక్ష దైవాలు

Poetry: తెలుగు కవిత-ప్రత్యక్ష దైవాలు

ఈ జీవితం వారికే ..

నా ప్రాణమే అమ్మ…
నాకు రక్షణే నాన్న….
ఈ దేహం వారిచ్చిన వరం….
ఈ జీవితం వారికే అంకితం…
అమ్మే నాకు ఆరాధ్య దైవం…
నాన్నే నాకు కొండంత ధైర్యం…
నా చివరి రక్తపు బొట్టు వరకు…
వారి సేవకై క్షణం క్షణం ఆరాటం..
నాకు స్ఫూర్తి దాతలు తల్లిదండ్రులే…
నా జీవం వారి రక్షణ కొరకే…
ప్రేమ తత్వమే నా మతం…
అమ్మా నాన్నల నామస్మరణే…
నా అంతరంగంలో మారుమోగే…
వెలకట్ట లేనిది ఈ సృష్టిలో….
అమ్మా నాన్నల ప్రేమ మాత్రమే…
నా ఊపిరి ఉన్నంత వరకు…
ఈ జీవితం వారికే అంకితం…
✍🏻 వి.జానకి రాములు గౌడ్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News