Sunday, October 6, 2024
Homeచిత్ర ప్రభManushi Chhillar: పెళ్ళైన వ్యాపారవేత్తతో యంగ్ హీరోయిన్ డేటింగ్..!

Manushi Chhillar: పెళ్ళైన వ్యాపారవేత్తతో యంగ్ హీరోయిన్ డేటింగ్..!

- Advertisement -

Manushi Chhillar: బాలీవుడ్ యంగ్ హీరోయిన్, మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ పెళ్ళైన ఓ వ్యాపార వేత్తతో డేటింగ్ లో ఉందట. 2017లో మిస్ వరల్డ్ టైటిల్ కైవసం చేసుకుని ఒక్కసారిగా పాపులర్ అయ్యిది మానుషి చిల్లర్. ఇండియా తరఫున ఈ కిరీటం అందుకున్న ఆరో బ్యూటీ మానుషీ కాగా 67వ ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకుంది ఈ హర్యానా బ్యూటీ. మిస్ వరల్డ్ టైటిల్ నెగ్గిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లోకి అడుగు పెట్టి బిజీగా మారింది.

అక్షయ్ కుమార్ తో కలిసి ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ అనే సినిమా చేయగా.. ఇది ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా మానుషీకి అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. త్వరలోనే ఈ అమ్మడు టాలీవుడ్ లో అడుగు పెట్టనున్నట్లు తెలుస్తుంది. వరుణ్ తేజ్ హీరోగా శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో మానుషీనే హీరోయిన్ గా ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.

కాగా.. మానుషీ ప్రముఖ వ్యాపారవేత్త నిఖిల్ కామత్ తో డేటింగ్ చేస్తుందని బాలీవుడ్ జనాలతో పాటు మీడియా కథలు కథలు రాస్తుంది. రెండేళ్లుగా వీరి వ్యవహారం సాగుతుండగా.. గత ఏడాది నిఖిల్ భార్యకు విడాకులిచ్చాడు. మానుషీ కారణంగానే నిఖిల్ భార్యకు విడాకులిచ్చాడని బీటౌన్ టాక్. వీరిద్దరూ తరచూ విహార యాత్రలకు వెళ్తూ బాలీవుడ్ జనాల కంట పడడంతో వ్యవహారం బయటకొచ్చింది. మరి వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్తుందా.. లేక కటీఫ్ తో సర్ధేసుకుంటారా అన్నది చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News