Friday, November 22, 2024
HomeNewsGarla: విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత

Garla: విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత

లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో..

పదో తరగతి వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని లంబాడి హక్కుల పోరాట సమితి ఏక్ మత్రో రాష్ట్ర అధ్యక్షులు వాంకుడోత్ మంగీలాల్ నాయక్ పేర్కొన్నారు. డాక్టర్ లకావత్ లక్ష్మీ నారాయణ నాయక్ పుట్టిన రోజు పురస్కరించుకుని
బుధవారం గార్ల మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ఎగ్జామ్ ప్యాడ్ పెన్నులు అందజేసి, బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఆత్మస్థైర్యంతో ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని, మంచి మార్కులతో విజయాలు అందుకోవాలని అన్నారు. ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు తల్లిదండ్రులకు మంచి పేరును తేవాలన్నారు. పదవ తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహకాలను అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ తెలంగాణ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ వినోద్ నాయక్ మాలోత్ కిషోర్ నాయక్ బానోత్ చిట్టిబాబు మాలోత్ శ్రీను పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేశ్వరరావు టి ఎస్ టి టి ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శివ మహబూబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్ పాఠశాల ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు కే ఎస్ కే చార్యులు రమేష్ ఫయాజ్ శ్రీను రామకృష్ణ సరోజ పద్మావతి కవిత విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News