Sunday, October 6, 2024
Homeపాలిటిక్స్Amaravathi: కొత్త ఎంపీలకు ఎన్నికల ధృవీకరణ పత్రాలు

Amaravathi: కొత్త ఎంపీలకు ఎన్నికల ధృవీకరణ పత్రాలు

ఏకగ్రీవ ఎన్నిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్ధులకు బుధవారం వెలగపూడి రాష్ట్ర శాసన సభ భవనంలో రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి యం. విజయరాజు వారికి రాజ్యసభ ఎంపిలుగా ఎన్నికైనట్టు ఎన్నికల ధృవ పత్రాలను అందించారు. ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు నామినేషన్ల ఉపసంహరణ అనంతరం వైసిపి తరపున పోటీలో ఉన్న ముగ్గురు అభ్యర్ధులు వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాధ రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో వారికి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి ఎన్నికల సంఘం ధృవీకరణ పత్రాలను అందించారు.

- Advertisement -


ఈకార్యక్రమంలో రాజ్యసభ ఎంపిలుగా ఎన్నికైన సభ్యులతో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.అలాగే సహాయ రిటర్నింగ్ అధికారి పివి సుబ్బారెడ్డి,డిప్యూటీ సెక్రటరీ వనితా రాణి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News