Saturday, November 23, 2024
HomeఆటRavi Gupta: ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ విజేతలకు డిజిపి అభినందనలు

Ravi Gupta: ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ విజేతలకు డిజిపి అభినందనలు

చార్మినార్ ట్రోఫి గెలిచిన మనోళ్లు

ఆల్ ఇండియా పోలీస్ డ్యూటి మీట్ లో ఓవరాల్ చాంపియన్ షిప్ (చార్మినార్ ట్రోఫి) ను కైవసం చేసుకున్న విజేతలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవి గుప్త సన్మానించారు. హైదరాబాదులోని రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక సమావేశం జరిగింది. క్రీడా విభాగపు ఐజిపి స్టీఫెన్ రవీంద్ర, ఏఐజి ఎం రమణ కుమార్ , ఐఎస్డబ్ల్యూ ఎస్పి ఎం. రామకృష్ణ తదితరులు ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవిగుప్త మాట్లాడుతూ…..దాదాపు 12 సంవత్సరాల తర్వాత తెలంగాణ పోలీస్ శాఖ చార్మినార్ ట్రోఫీని కైవసం చేసుకోవడం ప్రశంసనీయమని అభిప్రాయపడ్డారు. జాతీయ స్థాయిలో తెలంగాణ పోలీసులు ప్రతిభను కనబరిచి ఐదు బంగారు పతకాలు, ఏడు వెండి పతకాలు, ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ లో ఓవరాల్ విన్నర్స్ ట్రోఫీతో పాటు ప్రొఫెషనల్ వీడియోగ్రఫీలో ఓవరాల్ రన్నర్స్ ట్రోఫీని గెలుచుకుని తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతిభను మరొక్కసారి చాటి చెప్పారని కొనియాడారు. మన చార్మినార్ ట్రోఫీ మనం గెలుచుకున్నందున, దానిని మనం కాపాడుకోవాలని తదనుగుణంగా, విజేతలు శిక్షణ పొంది భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని డిజిపి ఆకాంక్షించారు. ఇతర రాష్ట్రాల వారు తెలంగాణ పోలీసులను శిక్షణ ఇవ్వమని కోరడం తెలంగాణ పోలీస్ శాఖ పనితీరుకు నిదర్శనం అని అన్నారు. భవిష్యత్తులో డ్యూటీ మీట్లను, స్పోర్ట్స్ మీట్లను జిల్లా స్థాయిలో ,రాష్ట్రస్థాయిలో నిర్వహించేలా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా డ్యూటీ మీట్ శిక్షణ గురించి ఐజిపి స్టీఫెన్ రవీంద్ర వివరించారు. డ్యూటీ మెట్ చీఫ్ కోచ్ టీం మేనేజర్ ఐన. ఐఎస్డబ్ల్యూ ఎస్పి ఎం. రామకృష్ణ లక్నో లో ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ జరిగిన తీరును వివరించారు.

- Advertisement -

బంగారుపథకాలు సాధించిన జి.రామకృష్ణారెడ్డి , డి.విజయ్ కుమార్, వి. కిరణ్ కుమార్, పి.అనంతరెడ్డి, ఎం. దేవేందర్ ప్రసాద్ లను ,వెండి పథకాలను గెలుపొందిన పి పవన్, ఎన్.వెంకటరమణ, ఎం.హరిప్రసాద్, కే శ్రీనివాస్, షేక్ ఖాదర్ షరీఫ్ , సి. హెచ్ .సంతోష్, కే సతీష్ లకు డిజిపి రవిగుప్త శాలువాలు కప్పి సన్మానించారు. చీఫ్ కోచులుగా వ్యవహరించిన ఐ ఎస్ డబ్ల్యూ ఎస్పి ఎం .రామకృష్ణ, రిజర్వ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ ఇక్బాల్, సబ్ ఇన్స్పెక్టర్ ఎం. ఎల్ .నరసింహారెడ్డి లతో పాటు కోచ్ లు గా ఉన్న కానిస్టేబుల్ కె అంజయ్య, ఏఆర్ ఎస్ఐ లు శ్రీనివాస్ మిశ్రా, ప్రీతం సింగ్, హెడ్ కానిస్టేబుల్ పి .సుదర్శన్, ఏఎస్ఐ బి .జయరాజు, ఫోటోగ్రాఫర్ టి మోహన్ రావు, పర్యవేక్షణ అధికారి, ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీ డి ప్రతాప్ లను డిజిపి అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News