ఆళ్లగడ్డ పట్టణంలోని విద్యానగర్ ఎల్. ఎం కాంపౌండ్ లో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి టిడిపి అభివృద్ధి పథకాల కరపత్రాలను అందజేశారు. ప్రజలు నీటి సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్నామని ఆమెకు విన్నవించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వ అధికారంలోకి రాగానే ఆళ్లగడ్డలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని, ఆళ్లగడ్డ ను ఆన్నివిదాల అభివృద్ధి చేసే బాధ్యత నాది అని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ హుస్సేన్ భాష, టిడిపి నాయకులు శ్రీనివాసులు రెడ్డి, శేఖర్ రెడ్డి ,మాజీ జెడ్పిటిసి చాంద్ బాషా భాస్కర్ యాదవ్, నన్నే బాయ్ గారి జిలాని టిడిపి కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.