Saturday, November 23, 2024
Homeపాలిటిక్స్Chevella: చేవెళ్ల గడ్డపై బీజేపీ జెండా ఎగరవేస్తాం లక్ష్మణ్

Chevella: చేవెళ్ల గడ్డపై బీజేపీ జెండా ఎగరవేస్తాం లక్ష్మణ్

బీఆర్ఎస్ తో పొత్తు ఉండదు

భారతీయ జనతా పార్టీ చెప్పట్టిన విజయ సంకల్ప యాత్ర బుధవారం రాత్రి చేవెళ్ళకు చేరుకుంది. మండల కేంద్రంలోని శంకర్ పల్లి చౌరస్తాలో సభ ఏర్పాటు చేశారు. స్థానిక నాయకులు రాజ్యసభ సభ్యులు లక్ష్మిణ్, మధ్యప్రదేశ్ ఇంచార్జి మురళిదార్ రావు ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డిలకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ…మోడీ ప్రభుత్వం బీజపూర్ జాతీయ రహదారికి నిధులు మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత వల్ల రోడ్డు పనులు జరుగుతలేవన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని దోపిడీ చేసిందని పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గల్లంతవ్వడం ఖాయమన్నారు.

- Advertisement -

మోడీ హయాంలోనే ముస్లింలకు న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేక సిఎం ఇతర పార్టీలోకి తొంగి చూపులుచూస్తున్నారన్నారు. అయోధ్యలో రాముడి గుడి కట్టిన ఘనత మోడీకే సాధ్యమైదన్నారు. భారత్ నుండి ఆయుధలను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేర్చింన ఘనత మోడీదన్నారు. రాష్టంలో నాలుగు బిజెపి ఎంపీలు ఉంటేనే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు 9 లక్షలు కోట్లు తెచ్చుకున్నామున్నారు. అదే 17 ఎంపి స్థానాలు గెలిస్తే ఎంత తెచ్చుకుంట్టామన్నారు.

రేవంత్ రెడ్డికి చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కూడా దొరకడం లేదని ఎద్దేవా చేశారు. త్వరలో జరగనున్న ఎంపీ ఎన్నికల్లో చేవెళ్ల లో కాంగ్రెస్ పరాజయం తప్పదు అన్నారు. ఇప్పుడు ఉన్న ఎంపీ భూములు కొన్నాడు తప్ప చేవెళ్ళకు చేసింది ఏమి లేదన్నారు. భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలే పునాది అన్నారు. దేశంలో మరో విప్లవం రాబోతుందన్నారు. బిఆర్ఎస్తో ఎలాంటి పోతులేద్దన్నారు. మూడో సారి మోడీని ప్రధానిగా గెలిచే వరకు జెండా దించేది లేదని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాశ్మీర్ రామ మందిర్ 500 సంవత్సరాల సమస్య తీర్చింది మోడీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ 80 శాంతం ఉన్న హిందుల మనోభావాలు అవమానపరిచిందన్నారు. నరేంద్ర మోడీ పాలనలో భారత భూభాగంలో ఉన్న ఏ ముస్లింకు అన్యాయం జరగడానికి విల్లులేదున్నారు. బిజీపి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఇంటికి కార్యకర్తలు తెలుపలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే రత్నం జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, పార్లమెంట్ ఇంచార్జ్ మల్లారెడ్డి, కార్యవర్గ సభ్యులు కంజర్ల ప్రకాష్,అసెంబ్లీ కన్వీనర్ ప్రతాప్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, అసెంబ్లీ కో కన్వీనర్ రమేష్, బిజెపి మండల అధ్యక్షుడు పాండురంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి అనంతరెడ్డి, మల్గారి రమణారెడ్డి, వైభవ్, మండల ఉపాధ్యక్షుడు కేశపల్లి వెంకట్రాంరెడ్డి, కృష్ణ గౌడ్ బండారు శేఖర్ రెడ్డి పత్తి సత్యనారాయణ కృష్ణమోహన్ వివిధ మండలాల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News