Saturday, November 23, 2024
HomeతెలంగాణMedaram: సమ్మక్క గద్దె వద్ద నున్న భారీ రావి వృక్షం మాయం

Medaram: సమ్మక్క గద్దె వద్ద నున్న భారీ రావి వృక్షం మాయం

మరో చెట్టు నాటిన మేడారం ట్రస్ట్

మేడారంలోని సమ్మక్క గద్దె వద్ద భారీ రావి వృక్షం ఉండేది. ఎత్తైన ఈ వృక్షం సమ్మక్క గద్దెను ఆనుకొని ఉండడంతో చల్లటి నీడ ఇచ్చేది. 2012 వరకు ఈ రావి చెట్టు, దీనినే రేలా చెట్టుగా పిలుస్తుండేవారు. సమ్మక్క, సారలమ్మల దర్శనానికి వచ్చే భక్తులు ఈ రావి చెట్టు బెరడు, కొమ్మలు అమ్మవార్ల మహిమ కలిగి ఉంటాయనే నమ్మకంతో బెరడును, కొమ్మలను తెంపుకొని తీసుకెళ్లడం ప్రారంభించారు. క్రమక్రమంగా పూర్తిగా చెట్టు బెరడు పోవడంతో ఆ రావి చెట్టు నిలువునా ఎండిపోయింది. తిరిగి వృక్షాన్ని పరిరక్షించడానికి చెట్టు మొదలు, చుట్టూ ఇనుప జాలీలు, ఫెన్సింగ్ వేసినప్పటికీ లక్షల్లో వచ్చే భక్తులు బెరడును, కొమ్మలను తొలిచి తీసుకెళ్లడంతో ఆ చెట్టు నిలువునా ఎండిపోయింది. సమ్మక్క సారలమ్మలు గద్దెలపై వచ్చిన మరుసటి రోజు జాతర మూడో రోజు ఈ రావి చెట్టుపై ఒక నాగుపాము ప్రత్యక్షమై కొద్ది సేపటి అనంతరం మాయం అయిపోయేదని స్థానిక ఆదివాసీలు చెప్పారు. తిరిగి ఇటీవల ఇదే ప్రాంతంలో మరో రావి చెట్టును నాటి, దాని రక్షణకు మేడారం ట్రస్ట్ బోర్డు తగు రక్షణ చర్యలు చేపట్టింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News