Friday, October 18, 2024
HomeతెలంగాణLasya Nandita: తీవ్ర విషాదంలో లాస్య నందిత ఫ్యామిలీ

Lasya Nandita: తీవ్ర విషాదంలో లాస్య నందిత ఫ్యామిలీ

షాక్ లో లాస్య ఫ్యామిలీ

సికింద్రాబాద్ కెంటోన్మెంట్ నియోజకవర్గ శాసన సభ్యురాలు, స్వర్గీయ సాయన్న కుమార్తె, లాస్య నందిత, ORR పై జరిగిన ప్రమాదంలో మృతి చెందారు.తను ప్రయాణిస్తున్న కారు, అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోనే యువ ఎమ్మెల్యేలలో ఒకరైన లాస్య నందిత మరణించడం దురదృష్టకరం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని CM రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సహా పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ నేతలంతా లాస్య మరణం పట్ల విచారం వ్యక్తంచేశారు. కాగా మరికాసేపట్లో లాస్య భౌతిక కాయం ఆమె స్వగృహానికి చేరుకోనుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు లాస్య ఇంటికి చేరుకున్నారు. మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు లాస్య కుటుంబానికి ధైర్యం చెబుతుండగా కాసేపట్లో కవిత కూడా లాస్య ఇంటికి చేరుకోనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News