Friday, April 11, 2025
Homeఆంధ్రప్రదేశ్Employees association: ఉద్యోగ సంఘాలతో మంత్రుల బృందం భేటీ

Employees association: ఉద్యోగ సంఘాలతో మంత్రుల బృందం భేటీ

డిమాండ్లు ఇతర సర్వీసు అంశాలపై ..

రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో మంత్రుల బృందం భేటీ. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డిమాండ్లు ఇతర సర్వీసు అంశాలపై చర్చించేందుకు వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో మంత్రుల బృందం సమావేశం ప్రారంభమైంది. ఈసమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వివిధ డిమాండ్లతో పాటు నూతన పీఆర్సీ తదితర అంశాలపై చర్చిస్తోంది.

- Advertisement -

ఈసమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి, ఆర్థిక శాఖ అధికారి చైతన్య, సర్వీసెస్ శాఖ కార్యదర్శి పోలా భాస్కర్ తదితర అధికారులు పాల్గొన్నారు.

అదే విధంగా ఉద్యోగ సంఘాల నుండి ఎపిఎన్జీఓ సంఘం అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, ఎపి సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె.వెంకట్రామి రెడ్డి, ఎపి రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ మరియు ఎపిజెఎసి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె.సూర్య నారాయణ, ఎపిఎస్టియు అధ్యక్షులు సాయి శ్రీనివాస్, పిఆర్టియు అధ్యక్షులు ఎం.కృష్ణయ్య, యూటీఎఫ్ అధ్యక్షులు ఎన్.వెంకటేశ్వర్లు, ఎపి టిఎఫ్ అధ్యక్షులు ఎన్.హృదయరాజు, ఎపి ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు ఎస్.బాలాజీ, ఎపి ప్రభుత్వ డ్రైవర్ల సెంట్రల్ యూనియన్ అధ్యక్షులు ఎస్ శ్రీనివాస్,ఆల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాల్గవ తరగతి ఉద్యోగుల సెంట్రల్ అసోసియేషన్ల అధ్యక్షులు చంద్రశేఖర్, మల్లేశ్వరరావు,ఎపి వెటర్నరీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రాఘవ రావు, తదితర ఉద్యోగ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News