దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం సమ్మక్క సారలమ్మల జాతర పురస్కరించుకొని శంకరపట్నం మండలం పరిధిలోని కేశవపట్నం వద్ద సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా నిర్వహించారు. కేశవపట్నం వద్ద సమ్మక్క సారలమ్మ జాతర మినీ మేడారంను తలపించింది . రెండు రోజుల నుంచి మండల వ్యాప్తంగా ఈ ప్రాంతానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో కేశవపట్నం ప్రాంతం కిక్కిరిసిపోయింది . సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద అమ్మవాళ్ళను దర్శించుకుని భక్తులు బంగారంను(బెల్లం) సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు.. అక్కడే వంటావార్పు నిర్వహిస్తూ బస చేశారు.