కరీంనగర్ నగరపాలక సంస్థ పరిదిలో గల వన దేవతల జాతర అంగరంగ వైభవంగా సాగింది. గత రెండు రోజులుగా సాగుతున్న సమ్మక్క సారలమ్మల జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో నగర ప్రథమ పౌరులు మేయర్ యాదగిరి అపర్ణ సునీల్ రావు దంపతులు 18,19 డివిజన్ పరిదిలో గల సమ్మక్క సారలమ్మ జాతరను సందర్శించారు. అమ్మవార్ల గద్దెలను అపర్ణ సునీల్ రావు దంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
ఎత్తు బంగారం బుట్టలతో అమ్మవార్ల గద్దెలకు చేరుకొని తల్లి పిల్లకు ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించారు. వన దేవతలకు ప్రత్యేక పూజలు చేసి… మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ… రెండు సంవత్సరాలకు ఒక సారి వచ్చే చరిత్ర కలిగిన గిరిజన వీరవనితల జాతర అన్నారు. పోరాట పటిమను కలిగి తెలంగాణ రాష్ట్రం లో వన దేవతలుగా వెలిసారని చరిత్రను గుర్తు చేశారు.
రేకుర్తి నగరపాలక సంస్థ పరిదిలో గల వన దేవతల జాతర కు భక్తుల కోసం ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం చాలా మంది భక్తులు వచ్చి సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని మొక్కులు చెల్లిస్తారని తెలిపారు.
అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.