టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 118 సీట్లకు ఉమ్మడి జాబితా ప్రకటించారు. రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుందని, దానిని పారద్రోలడానికి టీడీపీతో జత కట్టాలని పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటించాడు. పొత్తు కుదిరినప్పటి నుండి జనసేనకు ఎన్ని సీట్లు సర్దుబాటు చేస్తారు, ఏ ఏ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది,టీడీపీ టికెట్ ఎవరికి గల్లంతు అవుతుందని ఊహాగానాలు భారీస్థాయిలో నెలకొని ఉండేది.
కోస్తాలో జనసేన ప్రభావం అధికంగా ఉన్నదని రాజకీయ విశ్లేషకులు డిబేట్ లో ఉపన్యాసాలు కూడా చేశారు.వంగవీటి రంగా లాంటి నాయకుడు పవన్ కళ్యాణ్ రూపంలో వచ్చాడని కాపులు ఏకతాటికి వచ్చారు. సీనియర్ రాజకీయ కురువృద్ధుడు హరిరామ జోగయ్య బహిర్గంగానే జనసేనకు కనీసం 50 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. హరిరామ జోగయ్య లేఖతో జనసేన కార్యకర్తల్లో నూతనోత్సాహం వచ్చి మా ఆరాధ్య దేవుడు పవన్ కళ్యాణ్ కచ్చితంగా పవర్ షేరింగ్ లో రెండేళ్ల తర్వాత ముఖ్యమంత్రి అవుతాడని కలలు కన్నారు. 175 నియోజకవర్గాల్లో ఫలానా నియోజకవర్గంలో కచ్చితంగా జనసేననే బరిలో ఉంటుందని జనసైనికులు ఉత్సాహంగా ఉంటూ, సోషల్ మాధ్యమాల్లో ప్రజలకు వీడియోలు వైరల్ చేశారు. వారి ఆశయాలను నీరుగార్చుతూ అందరూ అనుకున్నట్లే పవన్ కళ్యాణ్ కు రాజకీయం చేయడం రాదు అనుకున్నట్లుగానే కేవలం 24 సీట్లతో సర్దుబాటు చేసుకొని, అసెంబ్లీలో కచ్చితంగా అడుగుపెట్టాలని, 24 మందిలో 98 శాతం గెలిచితీరుతామని ప్రెస్ మీట్ లో క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఆలోచనలు ఎలా ఉన్నాయో అంతుబట్టడం లేదు కానీ జనసైనుకుల్లో నిరుత్సాహం ఏర్పడినట్లు కనబడింది.
గత నాలుగున్నర ఏళ్ళు సైలెంట్ గా ఉన్న రాజకీయ ఉద్దందుడు, మూడు సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన మీనాక్షి నాయుడు అనూహ్యంగా బయటికి రావడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చింది. ప్రభుత్వానికి వ్యతిరేక కార్యక్రమాలు తనయుడు భూపాల్ చౌదరితో చేయించేవారు. దీంతో అందరూ మీనాక్షి నాయుడు పని అయిపోయిందని చర్చించుకున్నారు. టిడిపి సీనియర్ నాయకులు గుడిసె కృష్ణమ్మ, మదిరే భాస్కర్ రెడ్డి, మాన్వి దేవేంద్రప్ప, సౌదీ రఫ్,రామచంద్రలు టీడీపీ టికెట్ కోసం విశ్వప్రయత్నాలు చేశారు. ఇటీవల బిసి గర్జనలో మీనాక్షి నాయుడు ఎన్నడూ లేనివిధంగా అవేశంతో మాట్లాడుతూ నాకు సీట్ రాదని ఎందరో చెబుతున్నారు, వాటిని నేను పట్టించుకోను..మీనాక్షి సింగిల్ మెన్ అని కార్యకర్తల్లో జోష్ పెంచాడు. మీనాక్షి నాయుడు అనుకున్నట్లే పవన్ కళ్యాణ్ ప్రకటించిన 24 పేర్లలో ఆదోని టికెట్ జనసేన పేరు ఉండకపోవచ్చును అని ప్రజలు గుసగుసలాడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో కెఈ కృష్ణమూర్తి తర్వాత ఏకైక సీనియర్ మీనాక్షి నాయుడు కావడం,అదే సామాజిక వర్గం ఉండడం పట్ల ఆదోని సీట్ మీనాక్షి నాయుడు కే అధిష్టానం రెండో లిస్ట్ లో ప్రకటించే అవకాశం ఉంది. ఎంతమంది ఎన్ని కుట్రలు చేసిన తన సత్తా చాటుకుంటాదా వేచి చూడాలి.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించిన 24 సీట్లతో జనసైనికులలో తీవ్ర నిరుత్సాహం నెలకొన్నది. అధ్యక్షుడు ఇందుకోసమేనా పొత్తులు పెట్టుకున్నది అని కొందరు బాహాటంగా విమర్శిస్తున్నారు. తమ నాయకుడు మల్లప్ప వ్యక్తిత్వం బంగారం అని గత ఎన్నికల ప్రచారంలో పొగిడి నేడు వంచన చేశాడని మరికొందరు కోపోద్రిక్తులైనారు. 24 సీట్లలో కేవలం 5 మంది పేర్లు మాత్రమే ప్రకటించడంతో ఇంకా మల్లప్పకే టికెట్ సజీవంగా ఉన్నాయని పేర్ల ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.
ఇటీవల, గతంలో మల్లప్ప విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాటను శిరసాహిస్తానని చెప్పారు. మల్లప్ప టికెట్ రాకపోయిన పొత్తులో ఎవరికి వచ్చిన ప్రచారంలో పాల్గొని పవన్ కళ్యాణ్ ఆశయాలను నెరవేర్చాలని కార్యకర్తలకు సూచనలు చేశాడు. రెండు రోజుల క్రితం ఉమ్మి సలీం భవిష్యత్తు గ్యారెంటీ ఫ్లెక్సీలో టీడీపీ, జనసేన నాయకుల ఫోటో వేసి ప్రధాన కూడల్లో వేయడం పట్ల కూడా చర్చించుకున్నారు. ఆదోని టికెట్ ఎవరికి దక్కుతుందో, చివరికి వీరంతా కలసి జెండా ఎగురవేస్తారో లేదో చూడాలి.