Saturday, October 5, 2024
HomeతెలంగాణKTR: లాస్య నందిత కుటుంబాన్ని ఓదార్చిన కేటీఆర్

KTR: లాస్య నందిత కుటుంబాన్ని ఓదార్చిన కేటీఆర్

లాస్య నందిత కుటుంబానికి కేటీఆర్ పరామర్శ

దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ హోమ్ మంత్రి,ఎమ్మెల్సీ మహమూద్ అలీ,మాజీ మంత్రి,మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు అలా వెంకటేశ్వర్ రెడ్డి,గువ్వల బాల్ రాజ్,స్థానిక బీఆర్ఎస్ నేతలు.

- Advertisement -

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..”లాస్య రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయం తెలుసుకొని విస్మయానికి గురి అయ్యానన్నారు. ఆరోజు నేను విదేశాల్లో ఉండటం వల్ల రాలేక పోయాను, ఆ అమ్మాయిని గత 10,15 రోజులుగా అనేక ప్రమాదాలు వెంటాడాయి, గత ఏడాది వారి నాన్న ఎమ్మెల్యే సాయన్న చనిపోయారు. ఇప్పుడు ఈమె చనిపోవటం బాధాకరం వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం. లాస్య నందితను కంటోన్మెంట్ ప్రజలు భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ కార్యకర్తలకు, వారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాం. వారి కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నా” అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News