ఆలయాల అభివృద్ధే నా ధ్యేయమని కరీంనగర్ ఎంపి, బిజేపి జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్ అన్నారు. శంకరపట్నం మండలంలోని కొత్తగట్టు గుట్టపై వెలసిన శ్రీ మత్స్య గిరింద్ర స్వామిని బండి సంజయ్ కుమార్ దర్శించుకున్నారు. ఎంపీకి ఆలయ కమిటీ చైర్మన్ ఉప్పుగళ్ల మల్లారెడ్డి, పాలకవర్గ సభ్యులు, పూజారులు మురళీధరచార్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించారు.
అనంతరం ఎంపీ మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారమైన శ్రీ మత్స్య గిరింద్ర స్వామి ఆలయాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు. గుట్టపై గదుల నిర్మాణం లేక భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాటి నిర్మాణం కోసం రూ 10 లక్షల రూపాయలు కేటాయిస్తూ పనులను ప్రారంభించడం జరిగిందని ఆయన అన్నారు. మండపం నిర్మాణం నిధుల లేమితో పనులు నిలిచిపోయినాయని, వాటిని పూర్తి నిర్మాణం కోసం నిధులు కేటాయిస్తున్నట్లు ఎంపి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి అలివేలు సమ్మిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు ఏనుగుల అనిల్ , సైదాపూర్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి , రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దండు కొమురయ్య , వీణవంక మండల కార్యదర్శి ఆలేటి శ్రీనివాస్ రెడ్డి , చుక్కల శ్రీకాంత్, దాసరపు నరేందర్ , సుధాగోని శ్రీనివాస్ , ఇంద్రసేనారెడ్డి, పల్లె శివారెడ్డి, బీజేవైఎం కొండాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.