ముప్పై ఏళ్ల నంద్యాల రాజకీయంలో మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ కుటుంబ సభ్యులు బాగుపడ్డారు తప్పా మైనార్టీలకు చేసింది ఏమి లేదని, 5 సార్లు మంత్రి గాను, 3 సార్లు ఎమ్మెల్యేగా నంద్యాల నుండి ఎన్నికైన ఎన్ఎండి ఫరూక్ వారి అభివృద్ధికి ఒక్క పనీ చేయలేదని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి జి ఎం గౌస్ విమర్శించారు. నంద్యాల పట్టణం మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న ఓ కార్యాలయంలో వైసిపీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన సందర్బంగా ఆ హోదాలో గౌస్ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా గౌస్ మాట్లాడుతూ మైనార్టీల అభ్యున్నతికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నారన్నారు. చంద్రబాబు నాయుడు మైనార్టీ గురించి గొప్పలు చెప్పుతున్నారని, 175 సీట్లలో రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీలకు చంద్రబాబు నాయుడు ఒక్క సీటు కేటాయించారన్నారు. నంద్యాలలో మైనార్టీలు ఫరూక్ ను నమ్మే స్థితిలో లేరన్నారు. శిల్పా కుటుంబాన్ని విమర్శించే స్థాయి ఫరూక్ కు, ఫిరోజ్ కు లేదన్నారు.శిల్పా మోహన్ రెడ్డి, శిల్పా రవిలు నంద్యాలకు చాలా చేశారని, కానీ ఫరూక్ ఏమి చేశారో చెప్పాలని గౌస్ ప్రశ్నించారు.1985 సంవత్సరంలో మానాన్న GM గౌస్ పిరాకు వచ్చిన సిటును త్యాగం చేయడం వలననే ఫరూక్ కు అప్పట్లో టీడీపీ సీటు వచ్చిందని గుర్తు చేశారు. శిల్పా రవి వెంట మేమున్నాం… మైనార్టీలంతా శిల్పా కుటుంబం వెంటే ఉన్నారు. శిల్పాను టచ్ చేయాలంటే ముందు మమ్ములను టచ్ చేయాలన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచేది వైసిపీ నుండి శిల్పా రవి పోటీ చేస్తారని ఫరూక్ గెలవడం కష్టమేనన్నారు.
GM Gouse: ఫరూక్ గెలవడం కష్టమే
మైనార్టీలకు ఫరూక్ ఏం చేశారు?
సంబంధిత వార్తలు | RELATED ARTICLES