Saturday, April 19, 2025
HomeతెలంగాణGarla: పోగొట్టుకున్న సెల్‌ఫోన్ అప్పగింత

Garla: పోగొట్టుకున్న సెల్‌ఫోన్ అప్పగింత

సీఈఐఆర్ పోర్టల్‌లో నమోదు చేసుకోండి

గార్ల మండల పరిధిలోని గోపాలపురం గ్రామానికి చెందిన జడ వినోద్ కుమార్ ఈ నెల 16 తారీకున తన ఫోన్ పోయిందని గార్ల పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేయగా సీఈఐఆర్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసి పోయిన ఫోన్‌ను గుర్తించి బాధితునికి ఎస్సై జీనత్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఎవరైనా తమ సెల్‌ఫోన్ పోగొట్టుకున్నా, దొంగతనానికి గురైనా అట్టి ఫోన్ వివరాలు సీఈఐఆర్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.
పోర్టల్ ద్వారా మొబైల్ తిరిగి పొందే అవకాశం ఉందని, దీనిని ప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎవరికైనా మొబైల్‌ఫోన్‌లు, ఇతర వస్తువులు దొరికితే వాటిని సమీప పోలీస్‌స్టేషన్‌లో అప్పగించాలని, అంతేకానీ వాటిని తమవద్ద ఉంచుకోవడం నేరమని తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులకు బాధితుడు కృతజ్ఞతలు తెలిపాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News