Sunday, October 6, 2024
Homeచిత్ర ప్రభHanuMan Teaser: దుమ్మురేపుతున్న టీజర్.. బడా దర్శకులు చూసి నేర్చుకోవాలా?

HanuMan Teaser: దుమ్మురేపుతున్న టీజర్.. బడా దర్శకులు చూసి నేర్చుకోవాలా?

- Advertisement -

HanuMan Teaser: క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యంగ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా ‘హను-మాన్’. ఓ చోటా హీరో.. యంగ్ డైరెక్టర్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కావడంతో బడా హీరోల సినిమాలకుండే భారీ అంచనాలు ఈ సినిమాకు లేవు. అయితే, మేకర్స్ వాళ్ళ మీద వాళ్లకున్న నమ్మకంతో హను-మాన్ సినిమాని తొలి నుండే పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తూ.. అన్ని బాషలలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

కాగా, ఈ సినిమాకి సంబంధించి సోమవారం టీజర్ విడుదలైంది. అలా రిలీజ్ అయ్యిందో.. ఇలా సోషల్ మీడియాలో రికార్డ్స్ వ్యూస్ తో దూసుకెళ్తుంది. టీజర్ లో అద్భుతమైన గ్రాఫిక్స్ వర్క్.. ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ లాగా అనిపించడంతో మౌత్ టాక్ కు సోషల్ మీడియా తోడై టీజర్ దుమ్మురేపుతోంది. కేవలం రూ.12 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా మేకింగ్, సీజీ వర్క్ ఓ భారీ బడ్జెట్ సినిమా టీజర్ ని మించి ఆకట్టుకుంటుంది.

జస్ట్ 121 సెకన్ల ఈ టీజర్ విజువల్ వండర్‌ ని చూసిన ప్రేక్షకులు ఆదిపురుష్, బ్రహ్మాస్త్ర సినిమాలను గుర్తు చేసుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ మధ్య విడుదలైన బ్రహ్మాస్త్ర సినిమాతో పాటు ఆదిపురుష్ టీజర్ గ్రాఫిక్స్ పై తీవ్ర విమర్శలు వినిపించాయి. మూవీ మేకింగ్ పై కూడా దారుణమైన సెటైర్లు వినిపించాయి. ఇప్పుడు ఈ హను-మాన్ టీజర్ చూసిన ప్రేక్షకులు ఆ బడా దర్శకులు ఈ టీజర్ ను చూసైనా నేర్చుకోవాలని సెటైర్లు వేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News