Saturday, October 5, 2024
HomeతెలంగాణGodavari Khani: నిరుపేదల అండగా 'నీడ' సంస్థ

Godavari Khani: నిరుపేదల అండగా ‘నీడ’ సంస్థ

పేద పేషెంట్ కి 5000 ఆర్థిక సహాయం

గోదావరిఖని విటల్ నగర్ కు చెందిన రహీంకి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఇంటికి సున్నం వేసుకుంటూ జీవనం సాగిస్తున్న రహీం ఫ్రాంక్రియాస్, లివర్ సమస్యలతో మంచానికి పరిమితమయ్యాడు.
నిమ్స్ లో చికిత్స తీసుకున్నా తన ఆరోగ్యం బాగుపడలేదు. చికిత్స కోసం ఉన్న ఇల్లు కూడా అమ్ముకున్నాడు. ఆయుర్వేదం మెడిసిన్ వాడుతూ కొంత ఉపశమనం కలిగినా కూడా ఇంకా చికిత్స ఉన్నందున నెలకి 15 వేల రూపాయలు ఖర్చవుతుందనీ డాక్టర్లు చెప్పగా ఖర్చు భరించలేని స్థితిలో రహీం కుటుంబం ఉండడంతో స్థానిక ప్రజా ప్రతినిధి చుక్కల శ్రీనివాస్ ద్వారా విషయం తెలుసుకున్న నీడ అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్ నీడ గ్రూప్ సభ్యుల సహకారంతో 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు.

- Advertisement -

ఈ సందర్భంగా నీడ అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్ మాట్లాడుతూ వినూత్న ఆలోచనలతో సమాజానికి మంచి చేయాలనే తపనతో ముందుకు వెళ్తున్న నీడ మరొక అడుగు ముందుకు వేసి ఒక వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసి సభ్యులందరూ సహకారంతో ప్రతి నెలా 100 రూపాయలు జమ చేసి ఇలాంటి దీనులు ఎక్కడుంటే అక్కడ సాయం చేస్తున్నామని తెలిపారు.
నిజమైన నిరుపేద పేషెంట్లు, దీనగాధలు ఎలాంటివి ఉన్నా నీడ దృష్టికి తీసుకువస్తే తప్పకుండా సాయం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నీడ అధ్యక్షుడు పల్లెర్ల రమేష్ గౌడ్, విటల్ నగర్ మాజీ కార్పొరేటర్లు చుక్కల శ్రీనివాస్, బాబుమియా, నీడ సభ్యులు కాసిపేట సదానందం , కాలనీ పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News