తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ 500రూ. కే గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలు ప్రారంభించిన సందర్భంగా గంగాధర మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మంత్రి లత ఆధ్వర్యంలో మదురానాగర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద సంబరాలు చేశారు. కార్యక్రమంలో భాగంగా గ్యాస్ స్టవ్ మీద చాయి పెట్టి, సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, ప్రభుత్వాన్ని అభినందించారు. ఈ సందర్భంగా లత మాట్లాడుతూ ..పదేళ్ల తర్వాత తెలంగాణలో మహిళలకు గౌరవం దక్కిందని, ప్రజా ప్రభుత్వంలో అధికారాలు చేలాయించటాలు ఉండవని సేవ చేయడానికే ప్రభుత్వం ఉందని, రానున్న రోజుల్లో మరిన్ని పథకాలకు ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుడుతుందని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పురుమల్ల మనోహర్, బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు తోట సంధ్య, జిల్లా నాయకులు రామిడి రాజి రెడ్డి, రొమాల రమేష్, మండల కాంగ్రెస్ నాయకులు దోర్నాల శ్రీనివాస్ రెడ్డి, కరుణాకర్, రాచమల్ల భాస్కర్, గంగాధర సుదర్శన్ బూరుగు గంగన్న, బట్టు లక్ష్మీనారాయణ, కోలేపాక స్వామి, కరుణాకర్, అశోక్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.