Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Peddakadaburu: తిక్కారెడ్డికి టికెట్ రాకపోతే రాజీనామా

Peddakadaburu: తిక్కారెడ్డికి టికెట్ రాకపోతే రాజీనామా

సామూహిక రాజీనామాలకు సై

తిక్కారెడ్డికి టీడీపీ టికెట్ దక్కకపోతే రాజీనామా చేస్తామని స్థానిక టీడీపీ కార్యకర్తలు తీర్మానం చేశారు. ఈమేరకు మండల కేంద్రమైన పెద్దకడబూరులో తెలుగుదేశం పార్టీ నాయకులు, స్థానిక టిడిపి రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి పార్టీ కార్యాలయంలో తీర్మానం చేసినట్టు వారు వివరించారు.

- Advertisement -

ఈ సందర్భంగా మండల అధ్యక్షులు బసల దొడ్డి ఈరన్న మాట్లాడుతూ మంత్రాలయం టిడిపి ఎమ్మెల్యే టికెట్ తిక్కారెడ్డికే అధిష్టానం ఇవ్వాలని….. టిడిపి అధిష్టానం తిక్కారెడ్డికి టికెట్ ఇవ్వకపోతే టిడిపి రాష్ట్ర టిడిపి రైతు అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని వారు హెచ్చరించారు. రమాకాంత్ రెడ్డి మాట్లాడుతూ గత 10 సం.లుగా తెలుగుదేశం పార్టీ నియోజికవర్గ బాధ్యులుగా ఉన్నటువంటి పాలకుర్తి తిక్కారెడ్డి అన్ని వ్యయ ప్రయాసలు ఓర్చుకుని నియోజకవర్గం ప్రజల సమస్యలను పరిష్కరించేలా నాయకులను ఎదుర్కొని, భరిస్తూ, కార్యకర్తల కష్ట నష్టాలను తన కష్టంగా భావిస్తూ అన్ని విధాలుగా అండగా ఉంటూ వచ్చారన్నారు. పార్టీ పిలుపు నిచ్చిన ప్రతి ప్రోగ్రాం విజయవంతం చేస్తూ వచ్చారని గుర్తుచేశారు. పార్టీ జెండా ఆవిష్కరణ సమయంలో కాల్పులకు గురి అయి గాయాలపాలైనా, లెక్క చేయకుండా పార్టీ కార్యకర్తలకు ధైర్యం నింపుతూ ముందుకు సాగుతున్నారని, నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి దగ్గర అయ్యారని వారు వెల్లడించారు.

ప్రతి టీడీపీ కార్యకర్తనూ కాపాడుకుంటూ వస్తున్నారన్నారు. మంత్రాలయం నియోజికవర్గంలో బాలానాగి రెడ్డి ఎదుర్కొనే సత్తా కేవలం తిక్కారెడ్డికి మాత్రమే ఉందన్నారు. బాలనాగిరెడ్డి కనుసైగల్లో ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీలో చేరి, గ్రూప్ రాజకీయాలు చేస్తూ, పరోక్షంగా వైస్సార్సీపీ పార్టీ గెలుపునకు కృషి చేస్తున్నారని తిక్కారెడ్డి మద్దతుదారులు ఆరోపించారు. మంత్రాలయం నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి తిక్కారెడ్డి గెలుపును ఎదుర్కోలేక కుయుక్తులు పన్నుతున్నారన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు బసలదొడ్డి ఈరన్న, రాష్ట్ర సాధికార కమిటీ మెంబర్ కురువ మల్లికార్జున, రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకులు కోడుగుడ్ల ఏసేపు, ఆర్టిఎస్ నియోజకవర్గ అధ్యక్షులు చిన్నకడబూరు దశరథ రాముడు, ఎంజి నరసన్న, మీసేవ ఆంజనేయులు, తలారి అంజి, చిన్నతుంబలం వీరేష్ గౌడు, చిన్న తుంబలం సర్పంచ్ శివప్ప, గోపాల్, డీలర్ నరసింహులు, దొడ్డి మేకల ప్రతాప్ రెడ్డి, హనుమాపురం పెద్దయ్య, జాలవాడి ముక్కన్న, ఓంకారప్ప, ఈరన్న, మాజీ ఎంపీటీసీ రంగన్న, రంగాపురం మాజీ ఎంపీటీసీ కురువ మహాదేవ, వీరాంజనేయులు, వడ్డే వంటి చిన్న, కంపాడు మురళీకృష్ణ, మురువణి సత్యన్న గౌడ్, మురువణి భాష, ఎంపీటీసీ జనార్ధన్, డ్రైవర్ రంగన్న, యోహాను, చిన్న తుంబలం చాకలి చంద్రశేఖర్, కమలదిన్నె శీను, భగీరథ, దొడ్డి మేకల ఉరుకుందు, దొడ్డి మేకల అల్లప్ప, దొడ్డి మేకల అయ్యప్ప, లక్ష్మి కాంత్ రెడ్డి, ఐ టీడీపీ ఉపాధ్యక్షులు కురవ కృష్ణ, మురువణి చెన్నకేశవులు, బసలదొడ్డి కటిక రాజా, కల్లుకుంట దాసప్ప రెడ్డి, తాయన్న, మైనార్టీ నాయకులు మహమ్మద్, వివిధ గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలు నాయకులు క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్చార్జులు, తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్, ఐటీడీపీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News