శ్రీ అహోబిల లక్ష్మీనరసింహస్వామి పారువేట ఉత్సవాలు చివరి రోజున ఘనంగా ముగిశాయి. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తరఫున తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, అలంపూర్ జోగులాంబ దేవాలయం కార్యనిర్హణ అధికారి పురందర్ కుమార్, కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి పారవేట ఉత్సవ పల్లకిలో కొలువుదీరిన జ్వాల నరసింహ స్వామి ప్రహ్లాద వరద స్వాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అహోబిలం దేవస్థానం ప్రధాన అర్చకులు రమేష్. అర్చకులు మధు, సతీష్, సేతురామన్, ముందుగా తెలంగాణ ప్రభుత్వం తరఫున పంపిన పట్టు వస్త్రాలను ఉత్సవమూర్తులకు సమర్పించారు. అలాగే కంచి కామకోటి పీఠాధిపతి శంకర్ విజయేంద్ర సరస్వతికి అహోబిలం దేవస్థానం తరపున శాలువా కప్పి సన్మానించారు. అలాగే తెలంగాణ రాష్ట్రం తరఫున వచ్చిన అధికారులకు ఘనంగా సన్మానించి లక్ష్మీ నరసింహ స్వామి చిత్రపటాలను వారికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గంధం రాఘవరెడ్డి, పలువురు నాయకులు గ్రామ పెద్దలు అధికారులు అహోబిల దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.