ఏది పడితే అది మాట్లాడుతా అంటే ప్రజలు చూస్తూ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని ప్రజలు చూస్తూ ఊరుకోవాలని నోరు అదుపులో పెట్టుకోమ్మని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెలిచాల రాజేందర్ రావు అన్నారు. నగరంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తల్లిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కరీంనగర్ ఎంపీ, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ పొన్నం వైఖరిని తీవ్రంగా ఖండించడంతో పాటు బండి సంజయ్ ని ఉద్దేశించి మాట్లాడారు.
శ్రీరాముడు తన తల్లినే కాకుండా పినతల్లులను కూడా ఎంతో గౌరవించేవారు. ఇంతకు నీవు నిజమైన శ్రీరాముని భక్తునివేనా? మంత్రి పొన్నం ప్రభాకర్ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం చూసి నిజమైన రామభక్తులు నిన్ను అసహ్యించుకుంటున్నారు. శ్రీరాముడు మర్యాద రామన్న. ఎవరినీ బాధపెట్టేలా పల్లెత్తు మాట అనలేదు. శ్రీరాముడి పేరు మీద ఓట్లు దండుకుందామనే ఏకైక ఆలోచన ఉన్న నీకు ఆయన మర్యాద లక్షణాల్లో ఒక్కటి కూడా ఎందుకు అబ్బలేదో నీ మనస్సాక్షిని ప్రశ్నించుకో అన్నారు
శ్రీరాముడు సత్యశీలి. నిత్యం అసత్యాలు వల్లించే నీవు ఆయన పేరుమీద ఓట్లు దండుకోవడం ఎంత పొరపాటో నీ మనస్సాక్షిని అడిగితే జవాబు వస్తుంది. శ్రీరాముడు సౌమ్యానికి, సామరస్యానికి ప్రతీక. నిత్యం పూనకం వచ్చేలా ప్రవర్తించే నీకు, శ్రీరాముడికి పోలికా? నిన్ను నీవు ప్రశ్నించుకో నీకే అవగతం అవుతుంది. అసలు నేను శ్రీరాముడి భక్తుడినేనా అని. నేను నీకు బస్తీమే సవాల్ విసురుతున్నాను. నాకు కాంగ్రెస్ పార్టీ గనక అవకాశం ఇస్తే, నిన్ను మట్టి కరిపించి, కరీంనగర్ ను కోహినూర్ కరీంనగర్ గా చేయకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను. పొన్నం ప్రభాకర్ గురించి మట్లాడే హక్కు నీకు ఏమాత్రం లేదు. ఆయన బలహీనవర్గాల నుంచి ఎదిగొచ్చిన నాయకుడు. నిత్యం ఆ వర్గాల అభివృద్ధి కోసం, వారి సంక్షేమం కోసం పరితపించే వ్యక్తి, బీసీల కులగణను కూడా స్వాగతించలేని వ్యక్తివి నీవు.
పొన్నం ప్రభాకర్ తెలంగాణ పోరాట యోధుడు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర అమోఘం. తెలంగాణ కోసం సొంత పార్టీని సైతం ధిక్కరించాడు. పార్లమెంటులో తెలంగాణ వ్యతిరేకుల పెప్పర్ స్ప్రే దాడిని సైతం ఎదుర్కొన్నాడు. ఒక్కసారి కూడా ఇప్పటికీ జై తెలంగాణ అనని వ్యక్తివి నీవు. నీకు ఆయనకు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది. నీవా పొన్నం గురించి మాట్లాడేది? పార్లమెంటులో పొన్నం ప్రభాకర్ 850 ప్రశ్నలు వేస్తే.. నీవు ఎన్నేసినవయా? ఐదేళ్లలో పట్టుమని 57 ప్రశ్నలు వేసి కరీంనగర్ పార్లమెంటు పరువు తీశావు. కరీంనగర్ అభివృద్ధి కోసం ఎంపీ ల్యాడ్స్ నిధులు అందరి కన్నా తక్కువ ఖర్చుపెట్టిన ఘనత నీకే దక్కుతుంది. చేతిలో ఉన్న నిధులు కూడా సరిగా ఖర్చుపెట్టడానికి చేతగాని, మనసు రాని వ్యక్తివి నీవు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనే ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా నీకు ఇంకా బుద్ధి రాలేదు. నీ సత్తా ఎంటో ఆ ఎన్నికల్లోనే తేలిపోయింది. ఇష్టం వచ్చిన ప్రేలాపనలు పీలితేనే స్టేట్ ప్రెసిడెంట్ పదవి కూడా ఊడబీకి నీ స్థానం ఏంటో నీ పార్టీ వాళ్లే చూపెట్టారు. కబర్ధార్ ఇంకోసారి మా పొన్నం ప్రభాకర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. కళ్లముందు ఓటమి కనపడుతుండటంతో ఏమి చేయాలో తోచక, పవిత్రమైన తల్లిమీద రాజకీయాలు చేస్తూ మరింత దిగజారిపోతున్నావు. నిన్ను కరీంనగర్ ప్రజలు ఎలాగూ క్షమించరు. ఆ శ్రీరాముడే నిన్ను క్షమించాలని కోరుకుంటున్నాను. చివరగా ఒక్కటి గుర్తుపెట్టుకో బండి సంజయ్.. పార్లమెంటు ఎన్నికల తర్వాత ప్రజలే నీకు పర్మనెంట్ రిటైర్మెంట్ ఇవ్వడం ఖాయం.
నీ తల్లికి నీవు పుట్టినవా అని ఉపమానం ఏంది చండాలంగా, పిగుబందం ఉంటుంది. ఒకరు చెప్పాల్సిన అవసరం ఏముంది దాంట్లో, సంజయ్ అనేటాయిన ఐదేండ్లు ఏం పని చేయకుండా, ఏం అభివృద్ధి సాధించకుండా ప్రతీ ఎన్నికల ముందు దేవుడి పేరుతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ప్రజల మనోభావాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలు నీ నిజ స్వరూపం తెలుసుకున్నారు. తప్పకుండా తగిన జవాబు చెపుతారు.
బీజేపీ పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీ అయి ఉండి బడాటలు కొడుతూ గాలిమోటార్లో తిరుగుతూ నీ స్వంత నియోజకవర్గం ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోయిన నీవు తక్షణమే ఎంపీ టికెట్ త్యాగం చెయ్యి, ఎంతోమంది సీనియర్లైన రామకృష్ణారెడ్డి, సుగుణాకర్రావు, బాస సత్తన్న, ప్రతాప్, రామకృష్ణలాంటి సీనియర్లకు అవకాశం ఇవ్వకుండా ఏ మాత్రం నైతిక విలువలు పాటించకుండా సీటును పట్టుకుని వేలాడుతున్నావు..
ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ బిసి సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ మడుపు మోహన్, నాయకులు అబ్దుల్ రెహమాన్, ముద్దం తిరుపతి గౌడ్, రామిడి రాజీ రెడ్డి, తిరుపతి రెడ్డి, మహమ్మద్ అమెర్, జీడి. రమేష్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు