రాష్ట్ర పోలీస్ శాఖకు 50 బ్రీత్ ఎనలైజర్స్ ను డయాజియో కంపెనీ అందజేసింది. రాష్ట్ర పోలీస్ శాఖ ప్రధాన కార్యాలయంలో ఈ మేరకు ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవి గుప్తా, అడిషనల్ డీజీపీ రైల్వేస్ & రోడ్ సేఫ్టీ మహేష్ ఎం భగవత్ లకు డయాజియో కార్పొరేట్ ఎఫైర్స్ సీనియర్ జనరల్ మేనేజర్ రవి వర్మ, క్లస్టర్ హెడ్ సేల్స్ సీనియర్ జనరల్ మేనేజర్ అశ్వాంత్ బైసాని, మ్యానుఫ్యాక్చరింగ్ జనరల్ మేనేజర్ కే జై కృష్ణ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్ఆర్) ప్రోగ్రామ్స్ అసోసియేట్ మేనేజర్ రజత సరోహ తదితరులు బ్రీత్ అనలైజర్ లను అందజేశారు.
సమావేశంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవి గుప్త మాట్లాడుతూ….. దేశంలో ఎన్నో విభాగాలలో అగ్రగామిగా ఉన్న తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు నాణ్యత కలిగిన బ్రీత్ అనలైజర్ లను అందజేసేందుకు ముందుకు వచ్చిన డ యా జియో కంపెనీ మరియు ఎన్జీవో సిఎస్ఆర్ బాక్స్ లకు ధన్యవాదాలు తెలుపుతున్నా నన్నారు. సామాజిక బాధ్యత కింద వారు తీసుకున్న చొరవతో పోలీస్ సిబ్బంది సామర్థ్యం మరింతగా మెరుగవుతుందని, తద్వారా డ్రంక్ అండ్ డ్రైవింగ్ ను నియంత్రించవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ పరికరాల ద్వారా కొంతమంది నైనా కాపాడగలిగితే ప్రయోజనం ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని దానిని నివారించేందుకు పోలీస్ సిబ్బంది అహర్నిశలు పనిచేస్తున్నారని ఈ రకమైన ఆధునిక పరికరాల వల్ల పోలీస్ సిబ్బంది పనితీరు సామర్థ్యం పెరుగుతుందని తద్వారా ప్రజలకు మంచి జరుగుతుందని ఆకాంక్షించారు.
అడిషనల్ డిజిపి రైల్వేలు & రోడ్ సేఫ్టీ మహేష్ ఎం భగవత్ మాట్లాడుతూ….. ప్రయాణికులు బాధ్యతాయుతమైన డ్రైవింగ్ చేయడం వల్ల తమ ప్రాణాలే కాక ఇతరుల ప్రాణాలు కూడా కాపాడిన వారు అవుతారని అన్నారు. ఆధునిక పరికరాల ద్వారా పోలీస్ సిబ్బంది డ్రంక్ అండ్ డ్రైవింగ్ నివారించాల్సి ఉందని తెలిపారు. హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ సిపి విశ్వప్రసాద్ మాట్లాడుతూ… డ్రంక్ అండ్ డ్రైవింగ్ అరికట్టేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పష్టమైన విధానంతో ముందుకు వెళుతున్నారని , నిర్విరామంగా ట్రాఫిక్ పోలీసులు తదనుగుణంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమనే ఉద్దేశంతో తన సంస్థ ముందుకెళ్తుందని డయా జియో కంపెనీ నిర్వాహకులు తెలియజేశారు. లక్ష్యాన్ని సాధించేందుకు పోలీస్ శాఖకు నాణ్యత కలిగిన బ్రీత్ అనలైజర్స్ ను అందించాలని భావిస్తున్నామన్నారు. దాదాపు 25 ప్రాంతీయ రవాణా కార్యాలయాలతో సమన్వయం చేసుకొని ప్రజలను చైతన్య పరుస్తున్నామన్నారు .
రోడ్ సేఫ్టీ ఎస్పీ గోనే సందీప్, ఎల్బీనగర్ ట్రాఫిక్ డిసిపి శ్రీనివాసులు, సైబరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ డిసిపి లు వేణుగోపాల్ రెడ్డి, శివకుమార్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.