బివి మోహన్ రెడ్డి హయంలో కీర్తిశేషులు మాధవరం రామిరెడ్డి పది సంవత్సరాలు మండల పదవి అనుభవించారు. మంత్రాలయం నియోజకవర్గం 2009లో పునర్విభజన జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పొడిచి ప్రజారాజ్యం పార్టీలో చేరి 7000 ఓట్లతో సరిపెట్టుకొన్నారని నాయకులు ఆరోపించారు. మళ్లీ 2014 లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిసి తిరిగి పార్టీలోకి వచ్చారు. నాలుగున్నర సంవత్సరాలు అధికారంలో ఉండి పార్టీ పదవులు అనుభవిస్తూ.. తన వ్యక్తిగత పనులు చక్కబెట్టుకొని, మళ్లీ 2019 లో వైయస్ఆర్సీపీ పార్టీలో చేరారు. కర్నూలు జిల్లా కే డి సి సి బ్యాంకు చైర్మన్ పదవులు అనుభవిస్తూ జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ అక్కడే ఉండి బాలనాగరెడ్డి కనుసైగలతో రాజకీయాలు చేశారు . తండ్రి మరణం అనంతరం తర్వాత బాలనాగరెడ్డితో విడిపోయినట్లు ఉండి, కోవర్టుగా పనిచేస్తూ వైయస్సార్ అరాచక పాలన చేశారని ఆరోపించారు. అదే గ్రామంలో ఉండే బీసీ సోదరులపై దాడులు చేస్తూ కేసులు పెట్టించి, పైశాచిక ఆనందం పొందిన ఘనత మీకే దక్కిందని బీసీ నాయకులు ఆరోపించారు. అప్పుడు కనిపించలేదా వీరికి ఈ బీసీ- సోదరులు, వైస్సార్సీపీ పార్టీ తరపున బీసీలకు టికెట్ ఇవ్వమని, అడగలేకపోయారా? ఎమ్మెల్యే బాలనాగి రెడ్డి అడగనివ్వలేదా? మళ్లీ 2024వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిసి ఈసారి పాలకుర్తి తిక్కారెడ్డి గెలుపు ఖాయమని భయంతో ప్రస్తుత ఎమ్మెల్యే బాలనాగి రెడ్డి పావులు కదుపుతున్నారని తెలిపారు.
బాలనాగిరెడ్డి బీసీ అభ్యర్థికి డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకోమని కుట్రలు చేస్తున్నట్లు, ఇప్పటికే నియోజకవర్గ ప్రజల్లో గుసగుసలు వినపడుతున్నాయి తెలుస్తుందన్నారు. ఏదో ఒక వంకతో మూడు నెలలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరి, ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి చెప్పినట్లు వింటూ వైఎస్ఆర్సిపి జెండాను జేబులో పెట్టుకుని, తెలుగుదేశం పార్టీ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ, మేము బీసీలం – మేమే బీసీలం అంటూ, టిడిపి టికెట్ అడిగే అధికారం ఈ మాధవరం రాఘవేంద్ర రెడ్డి అయిన బీసీ సోదరులకు లేనే లేదని ఆరోపించారు. వీరు ఇప్పటికి ఎన్ని పార్టీ కార్యక్రమాలు చేశారని, ప్రజలు ఎలా నమ్ముతారు వీరిని, తెలుగుదేశం పార్టీ మీద గౌరవం ఉంటే, తన సొంత గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెండాను మీ సొంత ఇంట్లో జెండా ఎగురవేయడం ఏమిటని బీసీ నాయకులు ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు నియోజకవర్గం ప్రజలు, మీరు చేస్తున్న కుట్ర రాజకీయాలు ప్రజలు పార్టీ అధిష్టానం గమనిస్తుందని బీసీ నాయకులు అన్నారు.
అలాగే తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మంత్రాలయం నియోజకవర్గంలో నిత్యం గ్రౌండ్ లెవెల్ లో పనిచేస్తున్న బూత్ కమిటీల నుండి, క్లస్టర్, యూనిట్ ఇన్చార్జిలను నియమిస్తూ, అలాగే గ్రామ కమిటీ, నుండి మండలకమిటీ,జిల్లా కమిటీ,రాష్ట్ర కమిటీల వరకు పదవులు ఇస్తూ, BC, SC, ST, ముస్లిం మైనారిటీలకు,కురువ బోయ సోదరులకు,మరియు అన్ని విధాలుగా న్యాయం చేయగలిగిన వ్యక్తి పాలకుర్తి తిక్కారెడ్డి గారనీ పేర్కోన్నారు. ఇక్కడ ఉండే ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ, కురువ బోయ కులస్తుల, మరియు వేల కుటుంబాలు తిక్కారెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. మంత్రాలయం నియోజకవర్గంలో పార్టీ ఆదేశాల మేరకు ఏ ప్రోగ్రాం నిర్ణయించిన, ప్రతి ప్రోగ్రాం విజయవంతం చేస్తూ వచ్చారు పాలకుర్తి తిక్కారెడ్డి. తెలుగుదేశంపార్టీ అడుగుజాడల్లో నడుస్తూ,పార్టీ క్యాడర్ కు, పార్టీ కార్యకర్తలకు ఏ చిన్న సమస్య వచ్చిన, ఆ సమస్య మీది కాదు నాది అంటూ అన్ని విధాలుగా అండదండలుగా ఉంటూ నిరంతరం గ్రామ-గ్రామల ప్రజలు చుట్టూ తిరుగుతూ ప్రజలకు ఏమి అవసరమో వారి కష్టాలు- సుఖాలు గురించి ఆలోచించే వ్యక్తి, ఇక్కడ అన్ని విధాలుగా సరైన నాయకుడు పాలకుర్తి తిక్కారెడ్డి. ఈసారి మా నమ్మకం కూడా ఆయనేనని, అధిష్టానం నారా చంద్రబాబు నాయుడు మంత్రాలయం నియోజకవర్గం మీద మంచి నిర్ణయం తీసుకోవాలని, తొందరగా పాలకుర్తి తిక్కారెడ్డి గారికి టికెట్ కేటాయించాలని ఇక్కడ ప్రజలు, కార్యకర్తలు, కోరుకుంటున్నారు.
ఈ కార్యక్రమంలోమండల అధ్యక్షులు పండగ వెంకటేశ్వర స్వామి, వ్యాసరాజ్ స్వామి, బీసీ సెల్ అధ్యక్షులు అమర్నాథ్ రెడ్డి, క్లస్టర్ 07 వెంకటేష్, క్లస్టర్ 08 ఎల్లారెడ్డి, అశోక్ రెడ్డి, పవన్ కుమార్, సోషల్ మీడియా కోఆర్డినేటర్, విజయరామరెడ్డి, బూదురు మల్లికార్జున్రెడ్డి,గోపాల్ రెడ్డి, చిలకలదోన హనుమంతు, తిక్క స్వామి గౌడ్, రాగన్న, మైనారిటీ నాయకుల అబ్దుల్, పవన్ కుమార్, గోపాల్, కేశన్న, రవికుమార్, లక్ష్మయ్య, సుజ్ఞానం,ఇజ్రాయిల్, మాలపల్లి చంద్ర, ధర్మరాజు, మహమ్మద్ రెడ్డి, దేవదాసు,తెలుగు యువత అధ్యక్షులు సాయికుమార్, టిఎన్ఎస్ఎఫ్ నాయకులుశంకర్ నాయక్ ఐ టి డి పి సభ్యులు చిదానంద, మండల పార్టీ నాయకులు, కన్వీనర్లు, యూనిట్ ఇన్చార్జులు, క్లస్టర్ ఇన్చార్జిలు, గ్రామ కమిటీ నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు