Sunday, October 6, 2024
HomeతెలంగాణKothagudem: కోయగూడెం ఓసి నీళ్లు విడుదల చేయకపోతే పంటలు ఎండుతాయి

Kothagudem: కోయగూడెం ఓసి నీళ్లు విడుదల చేయకపోతే పంటలు ఎండుతాయి

అధికారులను వేడుకుంటున్న రైతులు

సింగరేణి కోయగూడెం ఓసి ప్రాజెక్టు నుండి నీళ్లను విడుదల చేస్తే ఆ నీళ్లు తమ పంటలకు బంగారమేనని రైతులు సంతోషంతో వ్యక్తం చేస్తున్నారు. అయితే కోయగూడెం ఓసి నుండి నీళ్లు విడుదల కోసం రైతుల ఎదురుచూస్తున్నారు. నీళ్ల కోసం అధికారులకు విజ్ఞప్తి చేసిన ఎలాంటి స్పందన లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు. తమ ఇబ్బందులను ఆలకించి సింగరేణి ఉన్నత అధికారులు స్పందించి కోయగూడెం నీళ్లు విడుదల చేయాలని అన్నదాతలు అధికారులను వేడుకుంటున్నారు.

- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల పరిధిలోని కోయగూడెం పరిసర ప్రాంతాల్లో అనేకమంది రైతులు ఎకరాల కొద్ది పంటలను సాగు చేస్తున్నారు. కోయగూడెం పరిసర ప్రాంతాల్లో పెద్దవాగు చిన్న వాగు పులిగుండం వాగులు ఉండగా ఈ వాగుల నుండే పంటలకు రైతులు సాగునీరు తీసుకునేవారు. అయితే గత ఏడాది వర్షాలు ఎక్కువగా కురువ నందున ఈ వాగుల్లో వరద నీరు చేరలేదు. అంతేకాకుండా కుంటల సైతం ఎండిపోయాయి. దీంతో రైతుల పంటలకు సాగునీరు కరువైంది. ఫలితంగా రైతులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. కనీసం సింగరేణి కోయగూడెం ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు నుండి వీటిని విడుదల చేస్తే రైతులు తమ పంటలను సమృద్ధిగా సాగు చేసుకునే పరిస్థితి ఉంటుందని వ్యవసాయ కార్మిక సంఘం నేతలు పేర్కొంటున్నారు.

రైతుల అభివృద్ధి కొరకు కృషి చేస్తున్నామని పాలకులు పదేపదే ప్రకటనలు చేస్తున్నప్పటికీ తమకు మాత్రం న్యాయం చేయలేకపోతున్నారని కారుకొండ సీతారాంపురం లాలు తండా బట్టు తండా వేపలగడ్డ పులిగుండం తదితర ఏరియా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సింగరేణి అధికారులు ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు నుండి నీళ్లు కాల్వ ద్వారా విడుదల చేస్తే పంటలు మంచిగా పండే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆదిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు.


ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేయాలి: రైతు మాలోత్ నారియా
సింగరేణి కొయ్యగూడెం ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు నుండి నీళ్లను విడుదల చేయాలని రైతు మాలోత్ నారియా విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం యాసంగి పంటలు వేశామని, ఈ పంటలకు నీరు లేక ఎండిపోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు. పంటలు ఎండిపోకుండా ఉండాలంటే కోయగూడెం ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేస్తే తమకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నాడు.


అధికారులు న్యాయం చేయాలి: మహిళ రైతు వాంకుడోత్ పద్మ
సింగరేణి కోయగూడెం ఓపెన్ కాస్ట్ అధికారులు రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు చేపట్టాలని మహిళ రైతు వాంకుడోత్ పద్మ విజ్ఞప్తి చేశారు. వాగుల్లో నీళ్లు లేక సాగునీరు దొరకని పరిస్థితి ఉందని ప్రస్తుతం తమ పంటలకు కోయగూడెం ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు నీళ్లు మాత్రమేనని పేర్కొన్నారు. రైతుల ఇబ్బందులను గమనించి అధికారులు ఓపెన్ కాస్ట్ నీటిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని మహిళా రైతు వాంకుడోత్ పద్మ విజ్ఞప్తి చేస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News