పాకిస్థాన్ లోని పెషావర్ లో బాంబు పేలుడు ధాటికి 17 మంది ప్రాణాలు కోల్పోయారు. 80 మందికి పైగా గాయపడ్డారు. నమాజు కోసం భారీ సంఖ్యలో ముస్లింలు ఓ మసీదులో ఉన్న సమయంలోనే ఈ పేలుడు సంభవించటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. మసీదులోని ఓ భాగం పేలుడు ధాటికి కుప్పకూలింది. దానికింద చాలామంది చిక్కుకుపోగా, సహాయక చర్యలు సాగుతున్నాయి. గాయపడ్డ వారిలో చాలామంది పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. గతేడాది మార్చిలో ఐఎస్ఐఎస్ సుసైడ్ బాంబర్ మైనారిటీ షియా మసీదుపై దాడి చేయగా 64 మంది మృతిచెందారు.
Blast: 17 మంది ప్రాణాలు తీసిన పాక్ పేలుళ్లు, 80 మందికి పైగా క్షతగాత్రులు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES