ఓవైపు ఆకలి కేకలు, మరోవైపు ఉగ్రదాడులతో దాయాది దేశం వణికిపోతోంది. ప్రార్థనల కోసం పెద్దఎత్తున తరలివచ్చిన జనంతో నిండిపోయిన పెషావర్ లోని మసీదులో తాలిబన్ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఈ దాడిలో ఇప్పటికే 46 మంది మృతి చెందగా మరో 150 మంది గాయపడ్డారు. వీరిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది.
పోలీస్ లైన్స్ లో ఉన్న మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో బాధితులు అత్యధికులు పాకిస్థాన్ పోలీసులే కావటం విశేషం. పోలీసులు, ఆర్మీ, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ కు చెందిన వారు ఈ జుహర్ (మధ్యహ్న నమాజు)లో ఉండగా వీరిని టార్గెట్ చేస్తూ తాలిబన్ ఆత్మాహుతి దాడి జరిగింది. నమాజు జరిగే సమయంలో మొదటి వరుసలో ఉన్న ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చేసుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ లో ఆగస్టులో జరిగిన దాడులకు ప్రతీకారంగానే ఈ దాడి జరిగింది.