Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Guduru: వైసీపీ అసంతృప్త నేతలకు బుజ్జగింపు

Guduru: వైసీపీ అసంతృప్త నేతలకు బుజ్జగింపు

రహస్యంగా మంతనాలతో ఒకే తాటిపైకి..

గూడూరు మండలంలో అసంతృప్తిగా ఉన్న వైసీపీ నేతలను జిల్లా అధ్యక్షుడు, కర్నూల్ మేయర్ బి వై రామయ్య, కోడుమూరు సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, కోడుమూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలపు సతీష్ రహస్యంగా మంతనాలు జరిపి ఒకే తాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. గూడూరు పట్టణం శివారులోని అస్లాం పత్తి మిల్లులో మండల వైసిపి ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలను పిలిపించుకుని మాట్లాడారు. చనుగొండ్ల, కే నాగలాపురం, బుడిజపాడు గ్రామాల నేతలు మరియు గూడూరు పట్టణంలోని నాయకులతో మాట్లాడి బుజ్జగించారు.

- Advertisement -

ఈ సందర్భంగా కోట్ల హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి సర్వే ఆధారంగా అభ్యర్థులను ప్రకటించారని, ఇందులో భాగంగానే ఆదిమూలపు సతీష్ ను కోడుమూరు వైసిపి అభ్యర్థిగా ప్రకటించారని కావున ప్రతి కార్యకర్త, నాయకులు ఐక్యతతో ఉంటూ గెలుపునకు కృషి చేయాలన్నారు. ఆదిములపు సతీష్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని వైసీపీలో విభేదాలకు తావు లేకుండా సేవలందిస్తూ కోడుమూరును అభివృద్ధి దిశగా తీసుకెళ్తానని అన్నారు. వైకాపా కార్యకర్తలు అర్ధరాత్రి ఫోన్ చేసిన వారికి సహాయ సహకారాలు అందిస్తానని వారు హామీ ఇచ్చారు.

బి వై రామయ్య మాట్లాడుతూ జగన్మోహన్ చేసిన అభివృద్ధి, సంక్షేమం మరల వైకాపాను అధికారంలోకి తీసుకొస్తాయని వారు గుర్తు చేశారు. కావున ప్రతి కార్యకర్త, నాయకులు ఐక్యతతో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు పట్టణ చైర్మన్ వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ పిఎన్ అస్లాం, మండల జెసిఎస్ నాయకులు చనుగొండ్ల మహేశ్వర్ రెడ్డి, కే నాగలాపురం నరసింహారెడ్డి, దౌల, ఎల్లారెడ్డి, జిల్లాని భాష, కౌన్సిలర్లు కిషోర్, మద్దిలేటి, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News