Saturday, April 19, 2025
Homeఆంధ్రప్రదేశ్Aluru TDP: టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం

Aluru TDP: టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం

ఎన్నికలకు మేం సిద్ధం

రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని టీడీపీ నేత వైకుంఠం మల్లికార్జున అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారం లోకి వచ్చిన జగన్ రెడ్డి అరాచక, నియంత పాలన సాగించడన్నారు. ఎన్నికలకు సిద్ధం అంటూ జగన్ చెప్పుకుంటే టీడిపి శ్రేణులు సైతం సంసిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజాదరణ కోల్పోయిన వైసిపికి ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెబుతారన్నారు. ఆలూరులో టీడిపి జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. సమావేశంలో మాజీ ఎంపీపీ బీమప్ప, టీడిపి నాయకులు రవి చంద్ర, ఉమాపతి, గుర్రం అనిల్, అరికేర మల్లెష్, సుబ్బు, అరికేర మల్లప్ప సోమన్న, రామాంజినేయులు, కరెన్న, గడ్డం నాగరాజు, వాల్మీకి రఘనందన్, గౌతమ్ నాయుడు, జాహిర్, జగనాథ్, అమర్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News