టిడిపి మేనిఫెస్టో లోని సిక్స్ పతకాలు ను ప్రజలకు వివరించలని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి కోరారు. స్థానిక బీవీ నివాసంలో ఎమ్మిగనూరు నియోజకవర్గం లోని క్లస్టర్ ఇంఛార్జి, యూనిట్ ఇంఛార్జి, బూత్ కన్వీనర్లతో పాటు నాయకులు కార్యకర్తలకు సమావేశం నిర్వహించారు. వీరికి సూపర్ సిక్స్ పతకాలు కిట్లు, కరపత్రాలను అందజేశారు.
- Advertisement -
ఈ సందర్బంగా బీవీ మాట్లాడుతూ అధికార వైకాపా ప్రభుత్వం వ్యూహాలను తలతన్నే విధంగా టిడిపి, జనసేన మేనిఫెస్టో ఉంది. ప్రజలను కలుసుకొని మన పార్టీ అమలు చేయబోయే మేనిఫెస్టోను వివరించడానికి ఇంటింటికీ వెళ్లాలన్నారు.