Friday, September 20, 2024
Homeపాలిటిక్స్Dhone: సారూ.. ఇంకోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోరాదూ

Dhone: సారూ.. ఇంకోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోరాదూ

నన్నే నమ్ముకున్నోళ్ల కోసం నేను పోటీకి సిద్ధం

భవిష్యత్తు కార్యాచరణపై కార్యకర్తలతో అభిప్రాయాలు సేకరణలో భాగంగా సుబ్బారెడ్డి స్వగృహం నుండి ర్యాలీగా బయలుదేరి పాత బస్టాండ్ మీదుగా టిడిపి ఆఫీస్ చేరుకోని భవిష్యత్తు కార్యాచరణ మీటింగ్ డోన్ పట్టణ టిడిపి అధ్యక్షులు చాటకొండ శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్భంగా మన్నె సుబ్బారెడ్డి మాట్లాడుతూ డోన్ అసెంబ్లీ టీడీపీ నియోజకవర్గం అభ్యర్థిగా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు డోన్ పాత బస్టాండ్ లో, జల్దుర్గం బహిరంగసభలో, అలాగే ప్యాపిలి బహిరంగ సభలో, మూడుసార్లు మన్నె సుబ్బారెడ్డి పేరు ప్రకటించి బుగ్గన్నకు కరెక్ట్ మొగుడిని దింపుతున్నాను, సుబ్బారెడ్డిని డోన్ నియోజకవర్గం ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించుకోండి అని చెప్పారన్నారు.

నేను ఎవరి ఇంటి దగ్గరికి తిరగలేదు, కేఈ కోట్ల కుటుంబం ఆశీస్సులతోనే నేను టిడిపి అభ్యర్థిగా డోన్ నియోజకవర్గంలో బరిలోకి దిగానని చెప్పుకొచ్చారు. కేఈ కోట్ల రెండు కుటుంబాలకి ఊడిగం చేశాను, ఇప్పుడు అనుకోకుండా ఒక రైతుబిడ్డ అయిన నన్ను అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుండి నియోజకవర్గంలోని ప్రతి ఊరు, ప్రతి గల్లీ తిరుగుతూ తెలుగు తమ్ముళ్లకు నేను అండగా ఉన్నా అన్నారు.

మొన్న విడుదల చేసిన టిడిపి నియోజకవర్గ అభ్యర్థిల జాబితాలో సుబ్బారెడ్డికి బదులుగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారని, జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నన్ను ఒక్క మాట కూడా అడగకుండా కోడి గొంతు కోసినట్లు, నన్ను నమ్మించి తడి బట్టతో నా గొంతు కోశారని ఆయన ఆరోపించారు.

నిన్న మొన్న వచ్చిన నాయకులు డోన్ నియోజకవర్గ తమ అడ్డా అని చెబుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఒక రైతు బిడ్డగా చెబుతున్నా ప్రజలందరికీ తెలుసు ఇది ఎవరి అడ్డా అంటూ, మీసం మెలేస్తూ, తలపాగా చుడుతూ, సింహం గర్జించేలా గర్జించారు మన్నె సుబ్బారెడ్డి.

తాను కోసిన గడ్డికి తాళ్లు కట్టి తీసుకెళ్తామంటే మనం ఊరికే చూస్తూ కూర్చుంటామా, జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఇంకొకసారి ఆలోచించండి, నన్ను మూడుసార్లు టిడిపి అభ్యర్థిగా ప్రకటించారు, ఇంకోసారి ఆలోచించి నన్ను టిడిపి అభ్యర్థిగా ప్రకటించలేరా అని నిలదీశారు. జాతీయ నాయకులు ఇంకోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, నన్ను నమ్ముకున్న కార్యకర్తల కోసం నేను పోటీకి సిద్ధం అని తెలియజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News