రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా గ్యారంటీ హామీలను అమలు చేస్తుందని అందులో భాగంగా కారేపల్లి మండలంలోని విశ్వనాథపల్లి పంచాయతీ పరిధిలోని కారేపల్లి క్రాస్ రోడ్ నందు విద్యుత్ శాఖ ఏర్పాటుచేసిన గృహజ్యోతి ప్రారంభోత్సవానికి వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ ముఖ్యఅతిథిగా హాజరై వారి చేతుల మీదుగా గృహ జ్యోతి పథకం కింద మంజూరు చేసిన 200 యూనిట్ ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలను పక్కాగా అమలు చేస్తామని. సింగరేణి మండలంలో గృహజ్యోతి పథకం 9,000 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే అమలులో ఉన్నటువంటి మహిళలకు ఉచితం బస్సు ప్రయాణం ద్వారా మహిళలు రాష్ట్రంలో గల వివిధ పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడం సులభంగా మారింది. తద్వారా దేవాలయాలకు ధర్మదాయ శాఖకు గతంలో కంటే మూడు రెట్లు పెరిగిందని.
నిరుపేదలకు సైతం రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభించి సీఎం రేవంత్ రెడ్డి నిరుపేద ప్రజల్లో వెలుగులు నింపారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి పెద్ద పీట వేస్తూ. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలులోకి తీసుకొచ్చి ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామన్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిధి పెంపును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అదేవిధంగా 6 గ్యారంటీ లల్లో భాగంగా ఈనెల 11న పేదలకు ఇందిరమ్మ ఇల్లు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి వాంకుడోత్ జగన్, టిపిసిసి మహిళ ఉపాధ్యక్షురాలు పగడాల మంజుల, మండల అధ్యక్షుడు తలారి చంద్రప్రకాష్, మాజీ జెడ్పిటిసి బాణోత్ దేవ్లా, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేదరి టోనీ, సొసైటీ డైరెక్టర్ లు అడ్డగోడ ఐలయ్య, బానోత్ హీరోలాల్, నాయకులు బాణోత్ రాంమూర్తి, కడియాల సుధాకర్, వాంకుడొత్ గోపాల్, కుర్షం సత్యనారాయణ, మహిళ నాయకురాలు తోటకురిశోభారాణి, సీఐ తిరుపతి రెడ్డి, విద్యుత్ ఏఈ భూక్య విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.