Saturday, October 5, 2024
HomeతెలంగాణHarish Rao: కాంగ్రెస్ మోసాలను ఇంటింటికీ వెళ్లి చెబుదాం

Harish Rao: కాంగ్రెస్ మోసాలను ఇంటింటికీ వెళ్లి చెబుదాం

పక్కా ప్రణాళికతో ప్రచారాలు

ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బిఆర్ఎస్ ఎంపి అభ్యర్థులు, ఆయా జిల్లాలకు చెందిన ఇతర ముఖ్య నేతలతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ భవన్ లో వేర్వేరుగా సమావేశం. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన కార్యాచరణపై ఈ సందర్భంగా చర్చించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు కామెంట్స్…

- Advertisement -

కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని క్షేత్ర స్థాయిలో ప్రజలకు వివరించి చెప్పాలని హరీష్ అన్నారు. గల్లీలో కాంగ్రెస్ ఉన్నా, తెలంగాణ సమస్యలు డిల్లీ వేదికగా ప్రశ్నించేందుకు, పరిష్కరించేందుకు బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు గెలవాలని దిశా నిర్దేశం చేశారు. రాజీ పడకుండా, తెలంగాణ ప్రయోజనాలు కాపాడటం ఒక్క బి ఆర్ ఎస్ తోనే సాధ్యం అవుతుందనే విషయాన్ని ప్రజలకు వివరించాలి. కాంగ్రెస్ మోసాలపై నిలదీయాలి. ప్రజల్లో చర్చ జరిగేలా చూడాలి. అధికారంలోకి వచ్చి మూడు నెలలు కావస్తున్న ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. రెండు మూడు హామీలు అసంపూర్తిగా అమలు చేసి అన్ని చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నది. రుణమాఫీ చెల్లించకుండా చోద్యం చూస్తున్నది, కరెంట్ రాకపోవడం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆరోపించారు.

పొలాలకు నీరు అందక ట్యాంకర్ లతో నీళ్ళు అందించే కాలం వచ్చిందన్న హరీష్, కాలిపోయే మోటార్లు, పెలిపోయే ట్రాన్స్ఫార్మర్ ల దుస్థితిని కాంగ్రెస్ మళ్ళీ తెచ్చిందన్నారు. అర్హులు అంటూ గ్యాస్ సబ్సిడీ 30% శాతం మందికే ఇస్తూ, మిగతా 70% వారికి మొండి చేయి చూపుతున్నారని హరీష్ రావు తెలిపారు. ఇలాంటి కాంగ్రెస్ మోసాలను ప్రజలకు ఇంటింటికీ వెళ్లి చెప్పాలని సలహా ఇచ్చారు. మార్చి 17 తో కాంగ్రెస్ 100 రోజుల పాలన పూర్తి చేసుకుంటున్నది. హామీలు అమలు చేయకుండా చోద్యం చూస్తున్న కాంగ్రెస్ ను నిలదీయాలని, వానాకాలం వడ్లు బోనస్ ఇచ్చి కొనలేదు. వచ్చే యాసంగి పంటకు బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలని నిలదీయాలన్నారు. కాంగ్రెస్ హామీలు అమలు కావాలంటే అనునిత్యం నిలదీసే బి ఆర్ ఎస్ తోనే అది సాధ్యం అవుతుందన్నారు.

వాస్తవాలను ఎప్పటికపుడు అన్ని వర్గాల ప్రజలకు వివరించాలని, కాంగ్రెస్ పాలన పై ప్రజల్లో ఇప్పటికే వ్యతిరేకత ప్రారంభం అయ్యిందన్నారు. అడుగడుగునా కాంగ్రెస్ ను నిలదీసే రోజులు ముందున్నాయన్నారు. పక్కా ప్రణాళికతో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మీడియా, సోషల్ మీడియా వేదికగా ప్రజలను జాగృతం చేయాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు దిశగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని హరీష్ అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News