Sunday, October 6, 2024
HomeదైవంNandyala Red cross medical camps: అన్ని శైవ కేంద్రాల్లో రెడ్ క్రాస్ మెడికల్ క్యాంప్స్

Nandyala Red cross medical camps: అన్ని శైవ కేంద్రాల్లో రెడ్ క్రాస్ మెడికల్ క్యాంప్స్

శివయ్య భక్తులకు సేవలు

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ప్రెసిడెంట్ నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ కే శ్రీనివాసులు ఆదేశాల మేరకు జిల్లాలోని శ్రీశైలం, యాగంటి , భోగేశ్వరం , ఓంకారం , మహానంది క్షేత్రాలలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మూడు రోజులు పాటు రాత్రి పగలు అనే తేడా లేకుండా భక్తులకు సేవలు అందించేందుకు ప్రాథమిక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి పర్ల వైస్ చైర్మన్ మారుతి కుమార్ లు తెలిపారు. ఈ సందర్భంగా నంద్యాల ఎన్టీఆర్ కాంప్లెక్స్ లోని రెడ్ క్రాస్ కార్యాలయం నందు ఉచిత వైద్య శిబిరం పోస్టర్లను ఆవిష్కరించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ట్రెజరర్ నాగేశ్వరరావు జిల్లా కార్యవర్గ సభ్యుడు ఉస్మాన్ భాష, నంద్యాల మండల రెడ్ క్రాస్ నాయకులు నాగేస్వశరరెడ్డి, మహానంది ఓంకారం గడివేముల వైద్య శిబిరాల పర్యవేక్షకులు అమర్నాథ్, షరీఫ్, శ్రీనివాసులు, కృష్ణయ్య డిఎఫ్ఓ రాజునాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు రెండు లక్షల 50 వేల రూపాయల విలువైన మందులు ఈ వైద్య శిబిరాలలో వినియోగించడం జరుగుతుందని, శ్రీశైల క్షేత్రంలో ఇప్పటికే వైద్య శిబిరం ప్రారంభమై మూడు రోజులు పైగా అయిందని, ఇంకా నాలుగు రోజులు పాటు శ్రీశైలంలో మూడు చోట్ల (పేచెరువు, కైలాస ద్వారము, శ్రీశైల శిఖరం) వైద్యశిబిరాలు నిర్వహిస్తామని ఈ వైద్య శిబిరాలన్ని కర్నూల్ రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డి మరియు జిల్లా కమిటీ సభ్యుల సహకారంతో నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ కార్యవర్గ సభ్యులు, శ్రీశైలం సబ్ బ్రాంచ్ చైర్మన్ నాగ శేషు ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహిస్తామని, అలాగే యాగంటి, ఓంకారం, భోగేశ్వరం, మహానంది క్షేత్రాలలో జరిగే వైద్య శిబిరాలకు జిల్లా వైద్యశాఖ ఆరోగ్య అధికారి డా.వెంకటరమణ , కాత్యాయని మెడికల్ అండ్ సర్జికల్స్ & సెవెన్ హిల్స్ హాస్పిటల్ వారు, మెడికల్ రేప్స్, జిల్లా రెడ్ క్రాస్ సభ్యులు యాకుబ్, నాగేశ్వరరావు తదితరులు సహకారం అందించారని తెలిపారు. దాదాపు 25 సంవత్సరాలకు పైగా ఈ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News