Sunday, October 6, 2024
HomeతెలంగాణVanaparthi: 100% ఉత్తీర్ణతే లక్ష్యంగా కేజీబీవీలు

Vanaparthi: 100% ఉత్తీర్ణతే లక్ష్యంగా కేజీబీవీలు

జిల్లా వ్యాప్తంగా 394 మంది విద్యార్థినిలు

10 పరీక్షలు ఈనెల 18 నుంచి 30వ తారీకు వరకు పరీక్షలు జరగనున్నాయి. అయితే అందుకోసం జిల్లాలోని కేజీబీవీ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులు ఈసారి కచ్చితంగా 100% ఉత్తీర్ణత లక్ష్యంగా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. గత సంవత్సరము కేజీబీవీ పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థినిలు 92 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ సంవత్సరం దానిని పెంచే దిశగా సెక్టోరియల్ అధికారి శుభలక్ష్మి ఎప్పటికప్పుడు పాఠశాలలను పర్యవేక్షిస్తూ ఉపాధ్యాయులకు పలు సూచనలు సలహాలు ఇస్తున్నారు.

- Advertisement -

జిల్లాలో..
జిల్లాలో మొత్తం 15 కేజీబీవీ పాఠశాలలో ఉండగా అందులో 10 తరగతి విద్యార్థులు 600 మంది విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారు. అంతేకాకుండా మూడు టీఎస్ ఎంఎస్ గర్ల్స్ హాస్టల్స్ కూడా ఉన్నాయి. ఇంటర్, 10 తరగతి విద్యార్థులు మొత్తం 3994 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి ప్రత్యేకమైన శిక్షణతో పాటు ఎప్పటికప్పుడు విద్యార్థుల ప్రతిభను గుర్తిస్తూ వారిని ప్రోత్సహిస్తూ మరింత మెరుగైన విద్యను అందించేందుకు అధికారులు, ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య వసతులు ప్రభుత్వం కల్పిస్తుంది.


గత విద్యా సంవత్సరం ఫలితాలో హవా..
గత సంవత్సరము 10వ తరగతి విద్యార్థినిలు 33 మందికి 9.5 జీపీఏ లు సాధించారు. అలాగే ఇంటర్లో 91 శాతం ఉత్తీర్ణత సాధించారు.
నైపుణ్య కార్యక్రమాలు..
ఆత్మరక్షణ కొరకై సెల్ఫ్ డిఫెన్స్ కోర్సును ట్రైనర్ తో ప్రతి సంవత్సరం మూడు నెలల పాటు విద్యార్థినులకు ప్రభుత్వం అందిస్తుంది. డిజిటల్ తరగతుల ద్వారా నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక బోధన ఎస్ఎస్సి, ఇంటర్ విద్యార్థినిలకు ప్రతినెల సి పి టి టెస్టులు కూడా నిర్వహిస్తున్నాం. దాని రిజల్ట్ ద్వారా విద్యార్థులలో సబ్జెక్టులో 100% రిజల్ట్ తీసుకురావడానికి అవకాశం ఎక్కువగా ఉండేందుకు ఉంటుంది. ఆన్లైన్ మోసాలపై అవగాహన, విద్యార్థులకు ఉచిత విద్య, పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్, స్టైఫండ్ లాంటివి కూడా నిర్వహిస్తున్నాం.

-పదిలో 100% సాధించడమే లక్ష్యంగా..
శుభలక్ష్మి, సెక్టోరియల్ అధికారి, వనపర్తి జిల్లా

“జిల్లా వ్యాప్తంగా 15 కేజీబీవీ పాఠశాలలో 600 మంది 10 తరగతి విద్యార్థినిలు విద్యను అభ్యసిస్తున్నారు. అయితే విద్యార్థినులకు ప్రత్యేక బోధన, సి పి టి పరీక్షలు నిర్వహించి విద్యార్థులకు సబ్జెక్టులో 100% రిజల్ట్స్ తీసుకురావడానికి ఎంతో కృషి చేస్తున్నాం. ఈసారి కచ్చితంగా 100% ఉత్తీర్ణత్తే లక్ష్యంగా విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నాం. కేజీబీవీలకు ఎంతో ప్రాధాన్యత పెరిగింది. ఎందుకంటే అన్ని రకాల సకల సౌకర్యాలు కల్పించడంతోపాటు నాణ్యమైన విద్యను అందిస్తున్నందున అందరూ మమ్మల్ని ఆసక్తిగా చూస్తున్నారు”.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News