Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Pathikonda: రాష్ట్రంలో అరాచక పాలనకు త్వరలో ముగింపు

Pathikonda: రాష్ట్రంలో అరాచక పాలనకు త్వరలో ముగింపు

టిడిపికి పట్టం కట్టండని పిలుపునిచ్చిన నారా భువనేశ్వరి

రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలన త్వరలో ముగుస్తుందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు.గురువారం తుగ్గలి మండలంలోని మీటేతాండ, కడమకుంట్ల గ్రామాలలో నిజం గెలవాలి అనే కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను అక్రమంగా పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారని ఆవేదనకు గురై చనిపోయిన మీటేతాండ మాజీ ఎంపీటీసీ రమావత్ లక్ష్మీబాయి, కడమకుంట్ల గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త వడ్డే చిన్న రాముడు ల కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించి ఒక్కొక్క కుటుంబానికి రూ మూడు లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఏ తప్పు చేయకపోయినప్పటికీ వైసిపి అరాచక ప్రభుత్వం అక్రమంగా కేసులు నమోదు చేసి,జైలు కు పంపడం జరిగిందన్నారు. అందువల్ల ఈప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని ఆమె అన్నారు.రాష్ట్ర అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీకి ప్రజలు పట్టం కట్టాలని ఆమె కోరారు. రాష్ట్రంలో 20 సంవత్సరాల అభివృద్ధి వెనక కు వెళ్లిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.నిరుద్యోగులకు ఉపాధి లేక అనేక ఇబ్బందులు గురవుతున్నారన్నారు.

- Advertisement -

వ్యవసాయ కూలీలు, కార్మికులు కూడా ప్రభుత్వం పెంచిన నిత్యవసర వస్తువులకు అనేక ఇబ్బందులు గురవుతున్నారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను కూడా ఈ అరాచక ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసిందని. అంతేకాక ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్న డబ్బు కూడా ఈ ప్రభుత్వం తీసుకోవడం జరిగిందని ఆమె ఆవేదన చెందారు. అందువల్ల ఈ వైకాపా అరాచక ప్రభుత్వాన్ని ప్రజలు సాగ పంపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆమె తెలిపారు. త్వరలో జరుగుతున్న శాసనసభ పార్లమెంట్ ఎన్నికలలో టిడిపి కార్యకర్తలు, నాయకులు సైనికులగా పనిచేసి టిడిపి ను గెలిపించాలని ఆమె కోరారు.

ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా అధ్యక్షులు బిటి నాయుడు, టిడిపి పత్తికొండ ఎమ్మెల్యే అభ్యర్థి కే.ఈ. శ్యాంకుమార్, మాజీ జెడ్పీ చైర్మన్ బత్తిన వెంకటరాముడు, శాలివాహన మాజీ ఫెడరేషన్ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర, మాజీ జెడ్పిటిసి వరలక్ష్మి, మాజీ ఎంపీపీ కొమ్ము వెంకటేశు, సర్పంచ్ మస్తాన్ బి, సిపిఐ మండల కార్యదర్శి సుల్తాన్, టిడిపి నాయకులు తిరుపాల్ నాయుడు, కొట్టాల వెంకటరామ చౌదరి, మీటే తండ రాము నాయక్, స్వామి నాయక్, కడమకుంట్ల పక్కిరప్ప పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News