Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Mantralayam: మంత్రాలయం టికెట్ జనసేన ఇంచార్జి లక్ష్మన్నకే ఇవ్వాలి

Mantralayam: మంత్రాలయం టికెట్ జనసేన ఇంచార్జి లక్ష్మన్నకే ఇవ్వాలి

లక్ష్మన్న గెలవడం ఖాయం

మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడుబూరు మండలం, హెచ్ మురవణి గ్రామంలో వాల్మీకుల సమావేశంలో రాష్ట్ర ఐక్య వాల్మీకి/బోయ పోరాట కమిటి రాష్ట్ర ఉపాద్యక్షులు జగ్గాపురం చిన్న ఈరన్న మాట్లాడుతు మంత్రాలయం నియోజక వర్గంలో దాదాపు 90 శాతం మంది బిసి లు ఉన్నారు. కాబట్టి బిసి లలో అత్యధికంగా మంత్రాలయం నియోజకవర్గంలో వాల్మీకి /బోయ ఓటర్స్ మంత్రాలయం నియోజకవర్గంలో మొత్తం ఓటర్స్ 2,06,000ల మంది ఉన్నారని అయితే ఇందులో 1,10,000ల మంది వాల్మీకి/బోయ ఓటర్స్,కర్నూలు పార్లమెంటులో 7 నియోజకవర్గలలో 5,00,000ల మంది వాల్మీకి/బోయ ఓటర్స్, రాయలసీమ జిల్లాలలో అత్యధికంగా వాల్మీకి/బోయ ఓటర్స్,ఆంధ్రప్రదేశ్లో 40,00,000ల మంది వాల్మీకి/బోయ ఓటర్స్ ఉన్నరు.బి.లక్ష్మన్న రాష్ట్ర ఐక్య వాల్మీకి,బోయ పోరాట కమిటి రాష్ట్ర అధ్యక్షులుగా 40 సంవత్సరాల నుండి ఆయన ఏ .పి .బిసి సంక్షేమ సంఘం 25 సంవత్సరాల నుండి రాష్ట్ర ఉపాద్యక్షులుగా బిసి ల హక్కుల కొరకు పోరాటం చేస్తున్నారు.బి.లక్ష్మన్న గత 40 సంవత్సరాలుగా వాల్మీకి/బోయలకు రాష్ట్ర అధ్యక్షులుగా ఉంటు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటణలు చేయడం జరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాడినప్పటి నుండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలను పర్యటించి వాల్మీకి/బోయ సింహగర్జనల పేరిట సభలు సమావేశాలు ఏర్పాటు చేసి వాల్మీకి/బోయలను చైతన్యవంతులను చేసి ఐక్యత పరిచారు.ముఖ్యంగా మంత్రాలయం నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో పర్యటించి గ్రామ గ్రామాన వాల్మీకి/బోయ కమిటిలను వేశారు.లక్ష్మన్నతో పాటు జగ్గాపురం చిన్న ఈరన్న గ్రామ జనసేన పార్టీ నాయకులతో కూడా మేమంతా కలిసికట్టుగా పర్యటించాముని మంత్రాలయం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్చిగా ఉంటున్న బి.లక్ష్మన్న 5 సంవత్సరాల నుండి జనసేన పార్టీకి విధేయుడుగా ఉంటూ పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమాని నిర్వహింస్తు, గ్రామాల పర్యటన చేస్తూ, కార్యాకర్తల సమావేశాలు నిర్వహిస్తు,కొన్ని గ్రామలలో జనసేన పార్టీ జెండాలను ఆవిష్కరిస్తూ జనసేన పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారని ఈసారి జనసేన పార్టీ టి.డి.పి పార్టీ పొత్తులో మరియు బి.జె.పి.పార్టీ త్వరలో కలుస్తుంది కాబట్టి అందరూ ఐక్యమత్యంతో పనిచేస్తే ఈసారి మంత్రాలయం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా బి.లక్ష్మన్న గెలవడం ఖాయం అని రాష్ట్ర ఉపాద్యక్షులు జగ్గాపురం చిన్న ఈరన్న హర్షం వ్యక్తం చేశారు.మంత్రాలయం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా బి.లక్ష్మన్నను ఎంపిక చేయవలసినదిగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి విజ్ఞప్తి చేస్తున్నాము అని రాష్ట్ర ఉపాద్యక్షులు జగ్గాపురం చిన్న ఈరన్న జనసేన పార్టీ అధినేతకు వారి డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు వాల్మీకి/బోయ నాయకులు మల్లేశ్,మునెప్ప, వీరేష్,లాలప్ప,హనుమంతు, శ్రీసు,పరమేశ్,గోపాల్, నాయుడు,ఉరుకుందు, నాగరాజు మరియు వాల్మీకి ప్రజలు,గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నరు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News