జిన్నారం మండల పరిషత్తు కార్యాలయ ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంపీపీ రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో మండలంలోని మహిళల ఉద్యోగులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలుగా నిలిచిన మహిళలకు ఎంపీపీ బహుమతులు ప్రధానం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ విశిష్టతను చాటుతూ మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంపిడిఓ, ఎంపీటీసీలు మహిళ ఉద్యోగులు పాల్గొన్నారు.
జాతీయ మహిళా దినోత్సవ సంబరాలను పరస్కరించుకొని బహుమతుల ప్రధానోస్తవ కార్యక్రమం టీ.ఎన్జీ.వోస్ అధ్యక్షులు ఎం.డి జావీద్ అలీ సమక్షంలో కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన డి.ఆర్.ఓ పద్మజా రాణి మాట్లాడుతూ మహిళా ఉద్యోగులు అన్ని రంగాలలో ముందంజలో ఉండాలని పిలుపునిచ్చారు, అనంతరం క్రీడాలలో పాల్గొన్న మహిళా ఉద్యోగులకు బహుమతులను ప్రదానం చేశారు.
జిల్లా అధ్యక్షులు ఎం.డి జావిద్ అలీ మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో ఉండాలని తెలియజేస్తూ, మహిళా ఉద్యోగులకు ఎలాంటి సమస్యలు ఉన్నా టీఎన్జీవో సంఘం పక్షాన ముందుండి సమస్యలు పరిష్కరించే దిశగా నా వంతు ప్రయత్నం చేస్తానని తెలియజేశారు. అదేవిధంగా మహిళా
ఉద్యోగులు అందరూ జిల్లా కలెక్టర్ ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి సహకరించిన జిల్లా కలెక్టర్ క్రాంతి. వల్లూరుకి, అడిషనల్ కలెక్టర్ మాధురికి, డిఆర్ఓ పద్మజా రాణికి, టీఎన్జీ సంఘం పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు.
కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వి.రవి గారు, అసోసియేట్ అధ్యక్షులు కసిని. శ్రీకాంత్, పి.వెంకట్ రెడ్డి, కోశాధికారి జి. శ్రీనివాస్, కేంద్ర సంఘం కార్యదర్శి నిర్మల రాజకుమారి, కేంద్ర సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం.డీ గౌస్, జిల్లా ఉపాధ్యక్షురాలు సుధామణి, కే. మమత, సుధారాణి, బాలమణి, ఇందిరా దేవి, ఇందిరా, సుకన్య రేణుక, సంధ్యారాణి, లావణ్య, ఎం.డీ.షకీల్, విజయ్ కుమా్,భాస్కర్ ప్రమోద్ వెంకటేశం యాదవ రెడ్డి, కృష్ణ, షరీఫ్, మహిళా ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.