వేప ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో వైద్య సుగుణాలు ఎన్నో ఉన్నాయి. నిత్యం వేపాకు నమలడం వల్ల చర్మం, శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. దంతాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. నోటి ఆరోగ్యం బాగుంటుంది. పండ్ల చిగుళ్లు బాక్టీరియా బారిన పడకుండా వేపాకు కాపాడుతుంది.
జీర్ణకోశంలోని బాక్టీరియాను వేపాకు నశింపచేస్తుంది. రోజూ వేపాకు నమలడం వల్ల కడుపులో పోట్లు, మలబద్దకం వంటి జీర్ణక్రియ సమస్యలు తలెత్తవు. ఈ ఆకులు మాడుపై దురదను తగ్గిస్తాయి. తలలో చుండ్రు సమస్యను పరిష్కరిస్తాయి. వేపాకు నీళ్లతో తలస్నానం చేస్తే చుండ్రు పోతుంది. వేపాకు నమలడం వల్ల కంటి సంబంధిత జబ్బుల బారిన కూడా పడరు.
ఈ ఆకులను నమలడం వల్ల రక్తం పరిశుభ్రమవుతుంది. యాంటి కాన్సర్, యాంటి ఫంగల్ సుగుణాలు వేపాకులో పుష్కలంగా ఉన్నాయి. శరీరంలో రోగనిరోధక శక్తి బలోపేతమవుతుంది. వేపాకు నమలడం వల్ల బ్లడ్ షుగర్ ప్రమాణాలు కూడా తగ్గుతాయి. యాక్నే సమస్యతో బాధపడేవారు ఉదయమే ఖాళీ కడుపుతో వేపాకులు తింటే మంచి ఫలితం ఉంటుంది.
చర్మ సంబంధమైన రకరకాల ఇన్ఫెక్షన్ల మీద కూడా వేపాకు వాడకం బాగా పనిచేస్తుంది. రోజువారీ వేపాకు వినియోగం వల్ల సహజసిద్ధమైన ఆరోగ్యకర జీవనశైలిని కొనసాగించవచ్చు. ఏదైనా అతి మంచిది కాదు. వేపాకు కూడా ఇందుకు మినహాయింపు కాదు.