Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Allagadda: 'కలలకు రెక్కలు' పేరిట టిడిపి బంపర్ ఆఫర్

Allagadda: ‘కలలకు రెక్కలు’ పేరిట టిడిపి బంపర్ ఆఫర్

బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం

జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, మహిళలు, ముఖ్యంగా యువత అయిన ఆడపిల్లల కోసం “కలలకు రెక్కలు” పేరిట పథకాన్ని తీసుకొని వచ్చి ఒక నూతన వరవడికి శ్రీకారం చుట్టారని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలోని మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సంయుక్తంగా ఈరోజు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే ముందుగా మహిళల సంక్షేమంపై దృష్టి పెడతామన్నారు. ఇంటర్ చదివిన ఆడపిల్లలకు స్వయం ఉపాధి, ఉన్నత విద్య కోసం బ్యాంకుల ద్వారా ప్రత్యేక రుణాలు ఇప్పిస్తామన్నారు. ఈ దేశంతో పాటు.. విదేశాలలో సైతం వారు చదువుకునేందుకు స్వేచ్ఛను కల్పిస్తామని తెలిపారు.

- Advertisement -

బీసీలకు సముచిత స్థానం కల్పిస్తామని, గతంలో టిడిపి ప్రభుత్వ హయాంలో 33% బీసీలకు రిజర్వేషన్లు ఉండగా ప్రస్తుత వైసిపి ప్రభుత్వ హయాంలో 26 శాతానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తగ్గించారని ఆమె ఆరోపించారు. తిరిగి తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీలకు పెద్దపీట వేసి వారికి అన్ని రంగాలలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. బీసీలకు 50 సంవత్సరాలకే 4వేలు రూపాయలు నెలకు పెన్షన్ చెల్లిస్తామని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన మహిళలందరికీ ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ నెలకు 1500 రూపాయలు అందజేయడం అలాగే 1.5 లక్షల కోట్ల రూపాయల మేరకు సబ్సిడీల కింద అందజేయడం జరుగుతుందని మాజీ మంత్రి అఖిలప్రియ స్పష్టం చేశారు.
బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం..
గతంలో బీసీలకు ఏ ప్రభుత్వం రక్షణ చట్టాలను కల్పించ లేదని టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముందుగా బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టాలను ఏర్పాటు చేస్తామన్నారు. బీసీలకు సైతం రక్షణ చట్టాలను తీసుకువస్తామన్నారు. బీసీలపై ఎవరైనా దాడులకు పాల్పడడం, తప్పుడు కేసులను పెడితే ఎస్సీలతో సమానంగా వారికి రక్షణ కల్పించే చట్టాలను తీసుకువస్తామన్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రానున్న ఎన్నికలలో ప్రజలు టిడిపికి పట్టం కట్టి, అఖండ మెజారిటీతో గెలిపించాలని అఖిలప్రియ విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News