Saturday, September 28, 2024
HomeదైవంSrisailam: శ్రీశైలం గుడికి పాగాలంకరణ

Srisailam: శ్రీశైలం గుడికి పాగాలంకరణ

దిగంబరులై పాగాను అలంకరించే భక్తుడు

లింగోద్భవకాల మహా రుద్రాభిషేకం ప్రారంభమైన వెంటనే పాగాలంకరణ ప్రారంభిస్తారు. బ్రహ్మోత్సవాలలో జరిగే ఈ పాగాలంకరణకు ఎంతో ప్రత్యేకత ఉంది. మన వివాహాలలో పెండ్లి కుమారునికి తలపాగ చుట్టడం ఒక సంప్రదాయం. ఈ ఆచారమే శ్రీశైల ఆలయంలో పాగాలంకరణ పేర్లతో ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ పాగా స్వామి వారి గర్భాలయ విమాన శిఖరం నుండి ముఖ మండపంపై ఉండే నందులను అనుసంధానం చేస్తూ అలంకరించబడుతుంది. పాగాలను సమర్పించే భక్తులు నియమంతో భక్తిని మేళవించి రోజుకు ఒక మూర చొప్పున సంవత్సరంలో 365 మూరల పొడవుతో ఈ పాగాను నేస్తారు. ఈ పాగాలను అలంకరించే వ్యక్తి దిగంబరుడై పాగాను అలంకరిస్తాడు. దిగంబరుడై పాగాను అలంకరించవలసి ఉన్నందున పాగాలంకరణ సమయంలో ఆలయంలో విద్యుత్ సరఫరాను నిలిపి వేస్తారు. చిమ్మచీకటిలో పాగాలంకరణ చేయడం ఎంతో నేర్పుతో కూడుకొన్న పని. యథావిధిగా రాత్రి గం.10.00ల నుండి ప్రకాశం జిల్లా, చీరాల మండలం, హస్తినాపుర గ్రామానికి చెందిన పృథ్వీ వెంకటేశ్వర్లు తనయుడు స్వయంగా తెచ్చిన పాగాతో పాటు ఇతర భక్తులు సమర్పించిన పాగాలను కూడా స్వామి వారికి అలంకరిస్తాడు.

- Advertisement -

ఈ సంవత్సరం మొత్తం 31 పాగాలు శ్రీస్వామి వారికి సమర్పించారు. ప్రకాశం జిల్లా నుంచి 4, బాపట్ల జిల్లా నుంచి 7. శ్రీకాకుళం జిల్లా నుంచి 6, విజయ నగరం జిల్లా నుండి 3, కోనసీమ జిల్లా నుండి 6, పశ్చిమ గోదావరి నుండి 2, కృష్ణా జిల్లా నుండి 1, తిరుపతి నుంచి 1 ఒడిషా నుండి 1 పొగ సమర్పించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News