Sunday, November 10, 2024
HomeతెలంగాణGundala: దక్షిణ కాశీ గుండాలలో శివయ్యకు పోటెత్తిన భక్తులు

Gundala: దక్షిణ కాశీ గుండాలలో శివయ్యకు పోటెత్తిన భక్తులు

పూజల్లో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కల్వకుర్తి నియోజకవర్గం పరిధిలోని శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఓం నమఃశివాయ అంటూ శివ నామస్మరణలతో మార్మోగాయి. కల్వకుర్తి నియోజకవర్గంలోని మైసిగండి శివాలయం, అయ్యాసాగర్ శివాలయం, తలకొండపల్లి మండలం చుక్కాపూర్ లోని మల్లప్ప గుట్ట , దక్షిణ కాశీగా పేర్గుంచిన గుండాల శివాలయం, వెల్దండలోని వీరబ్రహ్మేంద స్వామి ఆలయాలను శివరాత్రి పర్వదినం సందర్బంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి సతీసమేతంగా శైవ క్షేత్రాలను దర్శించుకోవడంతో అర్చకులు ఘన స్వాగతం పలికారు.

- Advertisement -

సతీ సమేతంగా స్వామివారికిి అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి అన్నదానంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే దంపతులను ఆలయ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. నియోజకవర్గంతో పాటు గ్రామాలలోని దేవాలయాలలో తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో శివాలయాలు చేరుకొని స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు.

శివరాత్రి సందర్భంగా ఆలయాలలో వేద పండితులు అభిషేకాలు, అర్చనలు,రుద్రాభిషేకాలు, శివపార్వతుల కళ్యాణం విశేష పూజలు చేశారు. భక్తులు ఉపవాస దీక్షలతో శివయ్య మొక్కలు తీర్చుకున్నారు.

శైవ క్షేత్రాలు భక్తజనసంద్రంగా మారాయి.రాత్రి జాగరణ భక్తులు భజనలు చేశారు.ఆలయాల నిర్వాహకులు దేవాలయాలను విద్యుత్ దీపాలు , మామిడి తోరణాలు , పూలదండలతో అత్యంత సుందరంగా అలంకరించారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకున్నారు.ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నాయకులు భూపతిరెడ్డి, ఆనంద్ కుమార్,సంజీవ్ యాదవ్, నాయకులు,కార్యకర్తలు,భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News