Sunday, October 6, 2024
HomeతెలంగాణSanathnagar: సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో మహిళా దినోత్సవం

Sanathnagar: సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో మహిళా దినోత్సవం

మహిళా పోలీసులకు సన్మానం

సనత్ నగర్ పోలీస్ స్టేషనులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా స్టేషనులో పనిచేసే మహిళా సిబ్బందిని శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా సీఐ పురేందర్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో మహిళలది కీలక పాత్ర అన్నారు.

- Advertisement -

పోలీసు శాఖలో కూడా మహిళల ప్రాతినిధ్యం పెరిగిందని తెలిపారు. స్టేషనులోని మహిళా సిబ్బందిని అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా సన్మానించుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు, ఏఎస్ఐ,హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News