Sunday, October 6, 2024
HomeతెలంగాణWarangal: మహిళలు ఆర్థికంగా ఎదిగేటందుకు అండగా ఉంటా

Warangal: మహిళలు ఆర్థికంగా ఎదిగేటందుకు అండగా ఉంటా

ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ ఎంజీఎం వారు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మంత్రి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, వారి సతీమణితో కలిసి పాల్గొన్నారు. అనంతరం హెల్త్ వర్కర్స్ నాయిని రాజేందర్ రెడ్డిని వారి సతీమణి నీలిమా రెడ్డిని శాలువా, పుష్పగుచ్చంతో సన్మానించారు.

- Advertisement -

వేయి స్థంభాల గుడిలో పూజలు

కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు మాట్లాడుతూ.. మహిళలు సమాజంలో గౌరవంగా బ్రతకాలని, వారు ఆర్థికంగా ఎదిగేటందుకు తాను అండగా ఉంటానని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారికి భరోసానిచ్చారు. అనంతరం మహిళలందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వేయి స్తంభాల గుడిలో పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే.. హన్మకొండ వేయి స్థంబాల గుడి రుద్రేశ్వర స్వామి శివరాత్రి మహోత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి దంపతులు. వేయి స్థంబాల గుడి కళ్యాణ మండప నిర్మాణ ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి ఎమ్మెల్యే వినతిపత్రం అందజేశారు.

హన్మకొండ వేయి స్థంబాల గుడిలో శ్రీ రుద్రేశ్వర స్వామి శివరాత్రి మహోత్సవాలు శివరాతి సంధర్భంగా వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు శాలువాలతో సన్మానించారు. మసీదు పునర్నిర్మాణంలో పాల్గొన్న ఎమ్మెల్యే.. హన్మకొండ 51 వ డివిజన్ లో అదాలత్ సెంటర్ వద్ద పునర్నిర్మాణం చేసిన మస్జిదే –ఖుర్ద్- (చోటి మస్జిద్ ) సుబేదారి వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, చీఫ్ కన్జర్వేటర్ మొహమ్మద్ జలాలుద్దీన్ అక్బర్ సాహాబ్ (రిటైర్డ్ ) రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ, ఎం.ఎల్.సి. సియాసత్ ఎడిటర్ ఆమిర్ అలీ ఖాన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఖాజా మొహినుద్దిన్, ముఫ్తీ ఒమర్ అబిదీన్, హాఫిజ్ పీర్ ఖాలీక్ అహ్మద్ సబీర్, ఆజం అలీ, మౌలానా హారూన్ రషీద్, మౌలానా అబ్దుల్ సత్తార్, మౌలానా ఫసిఉద్దిన్, మౌళ అబ్దుల్ అజీ, కన్వినర్ మౌలానా అతీఖుర్ రహమాన్, మదరసా అబూ బాకర్ సిద్దిఖి, మక్సూద్ అహ్మద్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News