Saturday, November 23, 2024
HomeఆటBandiathmakuru: శైవక్షేత్రాల్లో హోరాహోరీగా వృషభ రాజుల బల ప్రదర్శన

Bandiathmakuru: శైవక్షేత్రాల్లో హోరాహోరీగా వృషభ రాజుల బల ప్రదర్శన

ఓంకారం, కృష్ణనంది, శివనంది క్షేత్రాల్లో..

మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలంలోని అతి పురాతన సేవ క్షేత్రాలు ఓంకారం, కృష్ణనంది, శివనంది క్షేత్రాల్లో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎద్దుల బల ప్రదర్శన పోటీలు అలరించాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే తనయుడు వైసిపి యువ నాయకుడు శిల్పా కార్తీక్ రెడ్డి మూడు క్షేత్రాల్లో పర్యటించి స్వామి వారి దర్శన అనంతరం ఎద్దుల బలప్రదర్శన పోటీలను ప్రారంభించారు. అయితే ఈ పోటీలు రైతుల హర్షద్వానాలు, కేరింతలు, వీలలు,కేకల మధ్య మధ్య ఉత్సాహభరితంగా సాగాయి.

- Advertisement -

కృష్ణనందిలో విజేతలుగా నిలిచిన కడప జిల్లా వృషభాలు

కృష్ణ నంది క్షేత్రంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎద్దుల బలపరచిన పోటీలు నాలుగు పళ్ళ విభాగంలో జరిగాయి. ఈ పోటీల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 15 జతల వృషభాలు పాల్గొన్నాయి. రసవత్తరంగా సాగిన ఈ పోటీల్లో కడప జిల్లా, బ్రహ్మంగారి మఠం మండలం, కాశీపురం గ్రామానికి చెందిన శీలం జగన్మోహన్ రెడ్డి వృషభాలు విజేతలుగా రంకెలేశాయి. కడప జిల్లా కలసపాడు మండలం నల్లగొండ పల్లి గ్రామానికి చెందిన వల్లూరి రవినాథ్ రెడ్డి వృషభాలు రెండో బహుమతి దక్కించుకున్నాయి. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం ఏ కోడూరు గ్రామానికి చెందిన తిమ్మప్ప నాయుడు, అదే జిల్లా రుద్రవరం మండలం అప్పనపల్లి గ్రామానికి చెందిన బందెల గురుచరణ్ వృషభాలు మూడో బహుమతి సొంతం చేసుకున్నాయి. అలాగే నిర్వాహకులు పోటీల్లో పాల్గొన్న ఎనిమిది జతల ఎడ్ల వరకు నగదు బహుమతులు అందజేశారు.

శివనందిలో విజేతలుగా రంకేసిన నంద్యాల జిల్లా వృషభాలు

శివనంది క్షేత్రంలో నాలుగు పళ్ళ విభాగంలో ఎద్దుల బలప్రదర్శన పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో 8 జతలు వృషభాలు పాల్గొన్నాయి. హోరాహోరీగా సాగిన ఈ పోటీల్లో నంద్యాల జిల్లా, బండి ఆత్మకూరు మండలం, ఏ.కోడూరు గ్రామానికి చెందిన శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సిఎన్ ఆర్ బుల్స్,చాగంటి స్ఫూర్తికా రెడ్డి, సునీతారెడ్డి, చాగంటి నాగ మోహన్ రెడ్డి వృషబాలు మొదటి, రెండో బహుమతులను దక్కించుకున్నాయి. మూడో బహుమతి శ్రీ లక్ష్మీనరసింహస్వామి భోగాది సుదర్శన్ ధీరజ్ బ్రదర్స్ మూడో బహుమతి సొంతం చేసుకోగా వరుసగా ఐదు జతల వరకు నిర్వాహకులు నగదు బహుమతులను అందజేశారు.

ఓంకారంలో విజేతల వివరాలు
ఓంకార క్షేత్రంలో న్యూ కేటగిరి విభాగంలో ఎడ్ల బల ప్రదర్శన పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో ఎనిమిది జతల ఎడ్లు పాల్గొన్నాయి. హోరా హోరీగా సాగిన ఈ పోటీల్లో ప్రకాశం జిల్లా కంభం మండలం దర్గా గ్రామానికి చెందిన లాయర్ కృష్ణ వృషభాలు విజేతలుగా నిలిచాయి. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం వడ్ల రామాపురం గ్రామానికి చెందిన లలిత్ కుమార్ ఉత్సవాలు రెండో బహుమతి దక్కించుకున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా, లింగాల మండలం, రాయవరం గ్రామానికి చెందిన అనన్య రెడ్డి వృషభాలు మూడో స్థానంలో నిలిచాయి. కాగా వరుసగా ఆరు జతల ఎడ్ల వరకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఎంపీపీదే రెడ్డి చిన్న సంజీవరెడ్డి, మండల కన్వీనర్ బారెడ్డి శ్రీనివాసరెడ్డి, ఓంకారం చైర్మన్ అన్యం విశ్వనాధ రెడ్డి, కృష్ణ నంది చైర్మన్, పల్లె సోమశేఖర్ రెడ్డి, ఆదిలక్ష్మి రెడ్డి, బాలిశ్వర్ రెడ్డి, శివ శంకర్ రెడ్డి, దక్షిణేశ్వర్ రెడ్డి, భోజనం గ్రామ సర్పంచ్ బారెడ్డి భాస్కర్ రెడ్డి, పరమటూరు గ్రామ సర్పంచ్ జగన్మోహన్ రెడ్డి, ముడి మేళ పుల్లారెడ్డి, శివ నందిలో మండల ఉపాధ్యక్షులు రమణ, రాగాల బాబులు, వెంకటేశ్వర్లు, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. అనంతరం శ్రీ గంగా ఉమాసమేత ఓంకార సిద్ధేశ్వర స్వామి వారలకు నంది వాహన సేవ నిర్వహించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News