మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహానంది క్షేత్రంలో వెలసిన శ్రీ మహానందీశ్వర స్వామివారికి, శ్రీ కామేశ్వరి దేవి అమ్మవారికి లోక కళ్యాణార్థమై శనివారం మహా లింగోద్భావ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు స్థానిక కళావేదికపై వేద పండితులు రవిశంకర్ అవధాని ఆధ్వర్యంలో ఘనంగా వివాహ వేడుకను నిశ్చయించి అశేష జనవాహిక మధ్య అంగరంగ వైభవంగా స్వామివారి కల్యాణాన్ని జరిపించారు. శుక్రవారం రాత్రి 10 గంటల నుండి లింగోద్భావ కాల సమయమున స్వామి వారికి విశేష ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు.