Saturday, October 5, 2024
Homeనేషనల్Madras HC: విడాకులు కావాలంటే ఫ్యామిలీ కోర్టుకే వెళ్లాలి

Madras HC: విడాకులు కావాలంటే ఫ్యామిలీ కోర్టుకే వెళ్లాలి

భర్త నుంచి విడిపోవాలనుకున్న ముస్లిం మహిళలు కేవలం ఫ్యామిలీ కోర్టులనే ఆశ్రయించాలని మద్రాస్ హై కోర్టు తేల్చి చెప్పింది. ప్రైవేటు సంస్థలేవీ ముస్లిం మహిళలకు విడాకులు మంజూరు చేయకూడని, అవి చెల్లుబాటు కావని మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఖులా అంటే ముస్లిం మహిళ విడాకులు కోరి, వివాహాన్ని రద్దు చేసుకోవటం కోసం ఫ్యామిలీ కోర్టుకెళ్లక తప్పదని చెప్పింది. షరియత్ కౌన్సిల్ వంటివి ఇచ్చే తీర్పులు చెల్లుబాటు కావని కోర్టు వివరించింది. ప్రైవేటు సంస్థలు, షరియత్ కౌన్సిల్ వంటివి ఇచ్చే ఖులా సర్టిఫికెట్లకు విలువే లేదని, అవేవీ కోర్టులు కావని పేర్కొంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News