Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala: మహిళ చదువుకున్న రోజే దేశ అభివృద్ధి సంపూర్ణమవుతుంది

Nandyala: మహిళ చదువుకున్న రోజే దేశ అభివృద్ధి సంపూర్ణమవుతుంది

IMA ఆధ్వర్యంలో..

ప్రతి మహిళ చదువుకున్న రోజే దేశ అభివృద్ధి సంపూర్ణమవుతుందని ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ అన్నారు. అంతర్జాతీయ మహిళా వారోత్సవాలు పురస్కరించుకుని నంద్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో, నంద్యాల మధుమణి నర్సింగ్ హోమ్ సమావేశ భవనంలో, అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఐఎంఏ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఐఎంఏ నంద్యాల అధ్యక్షులు డాక్టర్ వసుధారాణి అధ్యక్షతన, ఉపాధ్యక్షులు డాక్టర్ మాధవి, మహిళా విభాగం కార్యదర్శి డాక్టర్ సరిత, డాక్టర్ శైలజ ల నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని, మహిళా వైద్యులతో కలిసి పురస్కార గ్రహీతలను ఘనంగా సత్కరించారు.ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు.

- Advertisement -

పురస్కార గ్రహీతలు
వైద్యులు డాక్టర్ రాణి ప్రమీల, డాక్టర్ కార్తీకి, డాక్టర్ యశోదర, రిటైర్డ్ నర్సింగ్ సూపరిండెంట్ శాంత కుమారి, సంఘమిత్ర నిర్వాహకురాలు శారదా విద్యాపీఠం ఉపాధ్యక్షులు ఉపాధ్యాయురాలు విజయశ్రీ, సిల్వర్ వోక్ స్కూల్, రవీంద్ర హై స్కూల్ ప్రిన్సిపల్ మాధవి, స్నేహ వృద్ధాశ్రమం నిర్వాహకురాలు సావిత్రి, ప్రభుత్వ బాలికల పాఠశాల మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకురాలు శశికళ.

ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ మహిళా విభాగం, మిషన్ పింక్ హెల్త్ విభాగాలు రాష్ట్ర బ్రాంచ్ స్థాయిలలో ఉత్తమ సేవలు అందించి వైద్యులకు, సమాజానికి వారధులుగా పనిచేస్తున్నారని కొనియాడారు. అన్ని రంగాలలో మహిళల ప్రాధాన్యత పెరుగుతున్నదని ఇది స్వాగతించదగిన పరిణామం అన్నారు. ప్రతి మహిళ చదువుకున్న రోజే దేశ అభివృద్ధి సంపూర్ణమవుతుందని అన్నారు. సమావేశంలో డాక్టర్ వసుధ, డాక్టర్ లక్ష్మీ సౌజన్య, డాక్టర్ అరుణ కుమారి డాక్టర్ కల్పన మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రాధాన్యత వివరించారు. డాక్టర్ సహదేవుడు భారతీయ సంస్కృతిలో మహిళకు ఉన్న ప్రాధాన్యత వివరించారు. డాక్టర్ మధుసూదనరావు, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో నంద్యాల ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ పనీల్ కుమార్, మహిళా వైద్యులు నాగమణి, లక్ష్మీ సౌజన్య, కల్పన, నర్మదా, అరుణకుమారి, శైలజ, సునీత, సరిత, సుసుమా, శిల్పా, అనూష పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News